Textbooks for Free: వారంలోనే పాఠ్యపుస్తకాల పంపిణీ చరిత్రాత్మకం
జూన్ 26న తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశంను జాజుల నేతృత్వంలోని బీసీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ...ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యుత్తు పంపిణీ అమలుకు చర్యలు తీసుకోవడం, ప్రభుత్వం విద్య అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యను ప్రోత్సహించారని దీంతో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని, విద్యాభివృద్ధి కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయమన్నారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు కె. శ్రీనివాస్ ముదిరాజ్ , బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.