Collector Encouragement: టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రోత్సాహం
గోదావరిఖనిటౌన్: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. బుధవారం సర్కస్‌గ్రౌండ్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు అందించే సూచనలు పాటిస్తూ మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు బాధ్యతగా ప్రతిరోజూ విద్యార్థులకు వేకప్‌కాల్స్ చేయాలని, ఉదయం రెండు గంటలు చదవాలని వారికి తెలపాలన్నారు.
Language Training: నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి జపనీస్ భాషపై శిక్షణ
పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. పదోతరగతి విద్యార్థుల కోసం సెలవురోజుల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.