Skip to main content

Rajarshi Shah: విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ భోజనం

జైనథ్‌: జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రారంభించి నాలుగేళ్లవుతున్న సందర్భంగా వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్‌ వేడుకలు జూలై 31తో ముగిశాయి.
Collector Rajarshi Shah  Collector Rajarshi Shah at the closing ceremony of Shiksha Saptah at Pipparwada ZP High School

మండలంలోని పిప్పర్‌వాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ముగింపు వేడుకలను కలెక్టర్‌ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోషకులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

చదవండి: Engineering Seats: యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మండలి గ్రీన్‌సిగ్నల్‌

విద్యార్థులకు భోజనం కోసం ముందుకు వచ్చిన దాత రాజారెడ్డిని కలెక్టర్‌ అభినందించారు. అంతకు ముందు పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించి, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.

అలాగే అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులతో ముచ్చటించారు. వారికి అందుతున్న పోషహాకారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఈవో ప్రణీత, ప్రధానోపాధ్యాయురాలు శశికళ, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, మండల ప్రత్యేకాధికారి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Published date : 01 Aug 2024 03:43PM

Photo Stories