CM Breakfast Scheme: దసరా నుంచి స్కూల్ విద్యార్థులకు అల్పాహారం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దసరా పండుగ నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’అమలు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
దసరా నుంచి స్కూల్ విద్యార్థులకు అల్పాహారం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు దసరా పండుగ రోజు నుంచి ఉచిత అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు తీరుతెన్నులపై ఆమె సెప్టెంబర్ 26న సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు.
పథకానికి సంబంధించిన మెనూను త్వరగా నిర్ణయించాలని, విధివిధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు.