Tenth Class: పరీక్షల హాల్‌టికెట్లు రెడీ.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ఆయన తెలిపిన మేరకు.. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభంకానున్న ఈ పరీక్షలకు హాల్‌టికెట్లను ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నామినల్ రోల్స్ ఆధారంగా పాఠశాల లాగిన్ ద్వారా బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిని ధ్రువీకరించి తమ పాఠశాల విద్యార్థులకు జారీచేస్తారు. హాల్‌టికెట్‌పై విద్యార్థి ఫొటో లేకపోయినా, తప్పుగా ముద్రితమైనా ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి సరైన ఫొటోను అతికించి దాన్ని సక్రమంగా ధ్రువీకరించి సంబంధిత విద్యార్థికి అందించాలి.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ | మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్ |
అటెస్ట్ చేసిన హాల్‌టికెట్ల కాపీని పరీక్షకేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌లకు ఫార్వర్డ్ చేయాలి. అటువంటి విద్యార్థులను పరీక్షకేంద్రాల్లోకి అనుమతించాలని అభ్యర్థన పంపాలి. ఫొటోమార్పు దరఖాస్తును (వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది) ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయానికి పరీక్షలు పూర్తయ్యేలోపు పంపాలి. స్ట్రీమ్, జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టినతేదీలను నమోదు చేయడం ద్వారా ఇతరులు కూడా బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.