Education System: విద్యావ్యవస్థ పరిరక్షణకు మరోపోరాటం
ఆగష్టు 1న జిల్లా కేంద్రంలో విద్యాఽర్థి సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యా రంగం పరిరక్షించాలని కోరుతూ.. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు కోసం పోరాటం చేసిన నాయకులపై ఇప్పటి కేసులు పోలేదన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలనే విషయంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: Joint Collector Jahnavi: విద్యార్థినులకు పాఠాలు చెప్పిన జేసీ
కనీసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలైన పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు తేలేక పోయారని విమర్శించారు. జిల్లాకి యూనివర్సిటీ కళాశాల, ఐటీఐ కళాశాలలకు స్థలం కేటాయించలేకపోవడం నాయకుల అసమర్థతకు అద్దం పడుతుందన్నారు. విద్యా వ్యవస్థను కాపాడడానికి ఐక్య ఉద్యమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, టీవీమూవీ, ఆర్‌వీఎస్, టీబీవీఎస్, బీసీఎస్‌ఎఫ్, వీఎస్‌ఎఫ్ నాయకులు బండి రాకేష్, బనుక శివరామ్, శ్రీనివాస్, వెంపటి అజయ్, రమేష్, శ్రీను, అనిల్, తదితరులు పాల్గొన్నారు.