తరగతి గదిని సమాజంలోకి తీసుకెళ్లడం ఏ పద్ధతి?
Sakshi Education
సోషల్ మెథడాలజీ
- ఉపాధ్యాయుడు సూర్య కుటుంబం అనే పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత ఎ అనే విద్యార్థి గ్రహానికి, న క్షత్రానికి తేడాను తెలుసుకున్నాడు. బి అనే విద్యార్థి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలను గురించి విశ్లేషించాడు. సి అనే విద్యార్థి సమీపంలోని నక్షత్రశాలను సందర్శించాడు. డి అనే విద్యార్థి సూర్య కుటుంబం నమూనాను తయారు చేశాడు. పై విద్యార్థులలో నెరవేరిన లక్ష్యాలు
1) ఎ. జ్ఞానం,
బి. అవగాహన,
సి. వినియోగం,
డి. నైపుణ్యం
2) ఎ. అవగాహన,
బి. వినియోగం,
సి. అభిరుచి,
డి. నైపుణ్యం
3) ఎ. అవ గాహన,
బి. వినియోగం,
సి. నైపుణ్యం,
డి. అభిరుచి
4) ఎ. వినియోగం,
బి. అవగాహన,
సి. అభిరుచి,
డి. నైపుణ్యం
- రేడియో, కార్టూన్, నాటకీకరణ అనేవి ప్రక్షేపితం కాని బోధనోపకరణాలు. వీటికి సరైన విద్యాపరమైన పేర్లు వరుసగా...
1) శ్రవణ ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం, కృత్య ఉపకరణం
2) కృత్య ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం, శ్రవణ ఉపకరణం
3) కృత్య ఉపకరణం, శ్రవణ ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం
4) గ్రాఫిక్ ఉపకరణం, శ్రవణ ఉపకరణం, కృత్య ఉపకరణం
- A అనే ఉపాధ్యాయుడు అటవీ ఉత్పత్తులు చూపించి బోధించాడు. B అనే ఉపాధ్యాయుడు గ్లోబ్ చూపిస్తూ బోధించాడు. C అనే ఉపాధ్యాయుడు తాజ్‌మహల్ నమూనా అద్దాల్లో ప్రదర్శిస్తూ బోధించాడు. A,B,C ఉపాధ్యాయులు ఉపయోగించిన బోధనోపకరణాలు వరుసగా...?
1) A మాతృకలు, B డయోరమా, C నమూనా
2) A మాతృకలు, B నమూనా, C డయోరమా
3) A మాతృకలు, B డయోరమా, Cమాకప్
4) A మాతృకలు, B మాకప్, C డయోరమా
- A అనే ఉపాధ్యాయుడు కాకతీయుల గురించి బోధించడానికి విద్యార్థులను వేయిస్తంభాల గుడి దగ్గరకు తీసుకెళ్లాడు. B అనే ఉపాధ్యాయుడు చోళుల పాఠం బోధనలో బృహదీశ్వరాలయం నమూనా చూపించాడు. A, B ఉపాధ్యాయులు ఉపయోగించిన బోధన పద్ధతులు
1) A సమస్యా పరిష్కార, B ప్రాజెక్ట్
2) A మూలాధార, B ఉపన్యాస
3) A ఉపన్యాస ప్రదర్శన, B మూలాధార
4) A మూలాధార, B ఉపన్యాస ప్రదర్శన
- ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు రూపొందించిన యూనిట్ టెస్ట్‌ను అనేక సార్లు నిర్వహించినప్పుడు.. విద్యార్థుల సగటు మార్కులు వేర్వేరుగా వచ్చాయి. ఆ యూనిట్ టెస్ట్‌కు ఉన్న లక్షణం?
1) సప్రమాణత
2) విశ్వసనీయత
3) ఆత్మాశ్రయత
4) అవిశ్వసనీయత
- బోధన ప్రారంభించడానికి ముందు చేపట్టే మూల్యాంకనం?
1) లోప నిర్థారణ మూల్యాంకనం
2) సంకలన మూల్యాంకనం
3) నిర్మాణాత్మక మూల్యాంకనం
4) సమగ్ర మూల్యాంకనం
- సూక్ష్మ బోధన చక్రంలోని సోపానాలు వరుసక్రమం తప్పాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే...
a) పునఃబోధన
b) ప్రతిపుష్టి
c) పునఃయోచన
d) పునఃప్రతిపుష్టి
e) యోజన
f) బోధన
1) f,e,d,a,b,c
2) b,c,d,f,a,e
3) c,d,b,e,a,f
4) e,f,b,c,a,d
- ‘పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత ఆశయమే ప్రాజెక్ట్’ అని నిర్వచించింది?
1) బెల్లార్‌డ
2) కిల్‌ప్యాట్రిక్
3) స్టీవెన్‌సన్
4) జాన్ డ్యూయి
- సాంఘికశాస్త్త్రం అనే పదం మొట్టమొదట ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
1) 1905
2) 1912
3) 1914
4) 1916
- అమెరికాలో సాంఘికశాస్త్త్ర జాతీయ మండలి ఏర్పడిన సంవత్సరం?
1) 1905
2) 1912
3) 1014
4) 1916
- అమెరికాలో సాంఘిక శాస్త్రాన్ని పాఠశాల స్థాయిలో ఏ సంవత్సరం నుంచి బోధిస్తున్నారు?
1) 1905
2) 1912
3) 1014
4) 1916
- అమెరికాలో సాంఘిక శాస్త్రాన్ని ఏ వాదం ప్రభావం వల్ల ప్రవేశపెట్టారు?
1) భావ వాదం
2) ప్రాకృతిక వాదం
3) నిజ వాదం
4) వ్యవహారిక సత్తావాదం
- పాఠశాల చిన్న మోతాదు సమాజం అని పేర్కొన్నది?
1) మహాత్మాగాంధీ
2) ప్లేటో
3) రూసో
4) జాన్ డ్యూయి
- సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశమే పాఠశాల అని పేర్కొన్నది?
1) మహాత్మాగాంధీ
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) స్వామి వివేకానంద
4) సర్వేపల్లి రాధాకృష్ణన్
- పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని మొదటిసారిగా మనదేశంలో ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1952
2) 1937
3) 1914
4) 1916
- భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన సంవత్సరం?
1) 1952
2) 1937
3) 1914
4) 1916
- సాంఘిక శాస్త్రంలో అర్థశాస్త్రాన్ని భాగంగా చేర్చాలని సూచించిన కమిషన్?
1) కొఠారి కమిషన్
2) మొదలియార్ కమిషన్
3) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
4) 1986 జాతీయ విద్యా విధానం
- 1986 జాతీయ విద్యావిధానం సూచించిన పది మౌలిక అంశాల్లో లేనిది?
1) చిన్న కుటుంబ భావన
2) శాస్త్రీయ దృక్పథం
3) అంతర్జాతీయ అవగాహన
4) పరిసరాల పరిరక్షణ
- ఆత్మాశ్రయత ఎక్కువ ఉండే ప్రశ్న?
1) ప్రణాళిక సంఘం అధ్యక్షుడెవరు?
2) అలీన రాజ్యాల మొదటి సమావేశం జరిగిన పట్టణం?
3) క్రూసేడులు అనగానేమి?
4) జాతీయ సమైక్యతకు అవరోధాలేవి?
- వస్త్వాస్రయత తక్కువ ఉండే ప్రశ్న?
1) రష్యా విప్లవం ఎప్పుడు జరిగింది?
2) మీకు ఇచ్చిన ప్రపంచపటంలో పోర్చుగల్ గుర్తించండి?
3) ముఖ్యమంత్రి మంత్రిమండలి నాయకుడని ఎలా చెప్పగలవు?
4) జెండ్ అవెస్తా.... పవిత్ర మత గ్రంథం
- హైస్కూల్ ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ లక్ష్యాలను సాధించారో తెలుసుకోవాలని యూనిట్ నికష తయారుచేయగా.. అది విద్యార్థుల లక్ష్య సాధనను మాపనం చేసింది. అయితే ఆ నికషకున్న గుణం?
1) విశ్వసనీయత
2) వస్తు ఆశ్రయత
3) సప్రమాణత
4) ఆత్మాశ్రయత
- సూర్య కుటుంబం-భూమి అనే పాఠం 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్రమానుగతంగా, వివరణాత్మకంగా రాయడం ఏ ఉపగమం?
1) వర్తులాకార ఉపగమం
2) ఏకకేంద్ర ఉపగమం
3) కాలక్రమ ఉపగమం
4) సమిశ్రణ ఉపగమం
- తరగతి గదిని సమాజంలోకి తీసుకెళ్లడం ఏ పద్ధతి ద్వారా అనుసరించవచ్చు?
1) సమస్యా పరిష్కార పద్ధతి
2) ప్రకల్పనా పద్ధతి
3) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
4) ఉద్గార పద్ధతి
- 8వ తరగతిలోని సూర్య, చంద్రగ్రహణాలు పాఠం ద్వారా సాధించే 1986 జాతీయ విద్యా విధానంలోని మౌలికాంశం?
1) పరిసరాల సంరక్షణ
2) శాస్త్రీయ ధోరణి
3) చిన్న కుటుంబ భావన
4) సామాజిక అవరోధాల తొలగింపు
- విద్యార్థులు సూర్య కుటుంబం నమూనాను తయారు చేయడం కిల్‌పాట్రిక్ ప్రకారం ప్రాజెక్టు రకాల్లో దేనికి సంబంధించింది?
1) ఉత్పత్తిదారుని రకం
2) వినియోగదారుని రకం
3) సమస్యా రకం
4) తర్ఫీదు రకం
- మహాత్మాగాంధీ పాఠ్యాంశం విన్న విద్యార్థి నిజాయితీగా ఉండటం అలవరచుకున్నాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) అభిరుచి
2) జ్ఞానం
3) వినియోగం
4) వైఖరి
- వాణిజ్య బ్యాంకులకు, రిజర్వు బ్యాంకుకు మధ్య భేదాలేంటి? అనే ప్రశ్న ద్వారా ఏ లక్ష్యాన్ని మాపనం చేయవచ్చు?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
- సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు తాజ్‌మహల్ చిత్రాన్ని ఓ.హెచ్.పి. ద్వారా చూపించాడు. ఆ ఉపాధ్యాయుడు ప్రదర్శించిన పరికరం?
1) ప్రక్షేపకం కాని సాధనం
2) ప్రక్షేపక సాధనం
3) త్రిపార్శ్వ సాధనం
4) ద్విపార్శ్వ సాధనం
- ఎక్కువ నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి అనే అంశంపై విద్యార్థుల్లో సరైన భావన కలిగించేందుకు ఉపాధ్యాయుడుగా నీవు ఉపయోగించేపటం(మ్యాప్)?
1) భౌతిక పటం
2) అవుట్‌లైన్ పటం
3) రిలీఫ్ పటం
4) రాజకీయ, భౌతిక పటం
- సాంఘిక శాస్త్రంలో ఒక యూనిట్‌ను బోధించిన తర్వాత వాటి ముఖ్యాంశాలను సమీక్షించి సారాంశరూపంలో విద్యార్థులకు చెప్పే అనువైన పద్ధతి?
1) మూలాధార పద్ధతి
2) ఉపన్యాస పద్ధతి
3) సామాజీకృత కథన పద్ధతి
4) ప్రాజెక్టు పద్ధతి
- ప్రాథమిక విధులు పాఠం విన్న విద్యార్థి ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
1) వినియోగం
2) జ్ఞానం
3) వైఖరి
4) అభిరుచులు
- ‘లౌకికతత్వం’ అనే పాఠ్యాంశాన్ని బోధించేందుకు ‘విద్యార్థులతో మొహర్రం పండుగను నిర్వహించిన’ బోధనా పద్ధతి?
1) సమస్యా పద్ధతి
2) ప్రాజెక్ట్ పద్ధతి
3) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
4) సామాజీకీకృత కథన పద్ధతి
- మహాత్మాగాంధీ జీవితంలోని వివిధ సంఘటనలను వివరించడానికి అనువైన చార్‌ట?
1) టేబుల్ చార్‌ట
2) కాలరేఖా చార్‌ట
3) వంశవృక్ష చార్‌ట
4) ప్రవాహ చార్‌ట
- భారతదేశంలోని జనాభా పెరుగుదల రేటును దశాబ్దాల వారీగా సూచించడానికి అనువైన గ్రాఫ్?
1) సచిత్ర గ్రాఫ్
2) వలయ గ్రాఫ్
3) రేఖా గ్రాఫ్
4) స్థూపరేఖా గ్రాఫ్
- దర్శనీయ ప్రదేశాలు అనే పాఠాన్ని బోధించేటప్పుడు చార్మినార్ ఈ రకానికి చెందిన మూలాధారం?
1) గౌణ వనరు
2) ప్రాథమిక వనరు
3) తృతీయ వనరు
4) సాంప్రదాయ వనరు
- భారతదేశం - భిన్నత్వంలో ఏకత్వం అనే పాఠం బోధించడం ద్వారా ఉపాధ్యాయుడు సాధించే ఆశయం?
1) జాతీయ సమైక్యత
2) అంతర్జాతీయ అవగాహన
3) మంచిపౌరునిగా తయారు చేయడం
4) సమాజం గురించి తెలియజేయడం
- చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సం బంధాల అధ్యయనమే సాంఘిక అధ్యయనం అన్నది?
1) జేమ్స్ హేమ్మింగ్‌స
2) ముఫట్
3) వెస్లీ
4) మైఖీలిన్
- డేవిడ్ వార్విక్ జట్టు బోధనలో సరైన క్రమం, ఉపగమం?
1) సమవర్తిత, విషయ స్వభావ, సంచయన క్రమానుగత, ఏక కేంద్ర నమూనా
2) విషయ స్వభావ, సమవర్తిత, సంచయన క్రమానుగత, ఏక కేంద్రనమూనా
3) సంచయన, క్రమానుగత, విషయ స్వభావ, సమర్తిత, ఏక కేంద్ర నమూనా
4) ఏక కేంద్ర నమూనా, సంచయన క్రమానుగత, విషయ స్వభావ, ఏక కేంద్ర నమూనా
- సమాధానాలు:
1) 2; 2) 1; 3) 2; 4) 4; 5) 4;
6) 1; 7) 4; 8) 1; 9) 1; 10) 2;
11) 4; 12) 4; 13) 4; 14) 1; 15) 1;
16) 2; 17) 3; 18) 3; 19) 4; 20) 3;
21) 3; 22) 2; 23) 2; 24) 2; 25) 4;
26) 4; 27) 2; 28) 2; 29) 3; 30) 2;
31) 3; 32) 2; 33) 2; 34) 4; 35) 2;
36) 1; 37) 1; 38) 2.
Published date : 30 Aug 2014 05:22PM