టెట్ కమ్ టీఆర్‌టీ.. అర్హత వివరాలు తెలుసుకోండిలా..
అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి టెట్ కమ్ టీఆర్‌టీ ఉంటుంది.
విద్యార్హతలు..
- ఎస్‌జీటీ: ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)/డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ) (లేదా) కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉండాలి.
- స్కూల్ అసిస్టెంట్: ఆయా సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. ఎస్‌ఏ–లాంగ్వేజెస్, ఎల్‌పీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఇతర పోస్టులకు ఆయా పోస్టులను బట్టి అకడమిక్, టీచింగ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉండాలి.
- వయసు: 18–44 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- గమనిక: సిలబస్, పరీక్షా విధానాలు, అర్హతలు, వయసుకు సంబంధించిన సమాచారం గత నోటిఫికేషన్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది.
మార్కుల వెయిటేజీ..
- స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీ: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ–80 మార్కులు; ఏపీ టెట్–20 మార్కులు).
- స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ–50 మార్కులు, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్–30 మార్కులు, ఏపీ టెట్–20 మార్కులు).
- మ్యూజిక్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ–70 మార్కులు, స్కిల్ టెస్ట్–30 మార్కులు).
- ప్రిన్సిపల్, పీజీటీ, క్రాఫ్ట్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ).
- ఎస్‌జీటీ: మొత్తం 100 మార్కులు (టెట్ కమ్ టీఆర్‌టీ).
స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ తదితర) (టీఆర్‌టీ)
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
1. | జీకే అండ్ | కరెంట్ అఫైర్స్ | 20 | 10 |
2. | విద్యా దృక్పథాలు | 10 | 5 | |
3. | విద్యా మనోవిజ్ఞానశాస్త్ర | |||
తరగతి గది అన్వయం | 10 | 5 | ||
4. | సంబంధిత సబ్జెక్టు | |||
కంటెంట్ | 80 | 40 | ||
మెథడాలజీ | 40 | 20 | ||
మొత్తం | 160 | 80 |
l పరీక్షకు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
ఎస్‌జీటీ–టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష విధానం సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
1. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 10 2. విద్యా దృక్పథాలు 10 5 3. విద్యా మనో విజ్ఞానశాస్త్రం 20 10 4. లాంగ్వేజ్–1(ఆప్షనల్) కంటెంట్ 20 10 మెథడాలజీ 10 5 5. లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్) కంటెంట్ 20 10 మెథడాలజీ 10 5 6. మ్యాథమెటిక్స్ కంటెంట్ 20 10 మెథడాలజీ 10 5 7. సైన్స్ కంటెంట్ 20 10 మెథడాలజీ 10 5 8. సోషల్ స్టడీస్ కంటెంట్ 20 10 మెథడాలజీ 10 5 మొత్తం 200 100
- పరీక్షకు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
ఇంకా చదవండి: part 3: ఎస్‌జీటీ సాధించాలనుకునేవారి కోసం.. ఈ ప్రిపరేషన్ గైడెన్స్..