టెట్ కమ్ టీఆర్‌టీ ఎస్జీటీ దక్కాలంటే..
Sakshi Education
పాత సిలబస్ అని ఒకరంటే.. లేదు కొత్త సిలబస్ ఉంటుందని మరొకరు.. లేదు లేదు పాత, కొత్త కలిిపి సరికొత్త సిలబస్ అని ఇంకొకరు..
భారీగా సిలబస్:
డీఎస్సీతో టెట్‌ను కలపడం వల్ల సిలబస్ భారీగా పెరిగింది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల కంటెంట్‌తో పాటు ఆయా సబ్జెక్టుల మెథడాలజీలను అధ్యయనం చేయాల్సి రావడంతో అభ్యర్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే గతంతో పోల్చితే ప్రస్తుత డీఎస్సీకి కొంత ఎక్కువ సమయం అందుబాటులో ఉంది కాబట్టి సరైన ప్రణాళిక ప్రకారం చదివితే విజయం సాధించడం కష్టమేమీ కాదు.
జీకే, కరెంట్ అఫైర్స్
స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అంతర్జాతీయ సదస్సులు, రాజ్యాంగ సవరణలు, ముఖ్యమైన తేదీలు, ప్రధాన స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు-గ్రహీతలు తదితర అంశాలను చదవాలి. వార్తా పత్రికలు చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించవచ్చు. ఇటీవల కాలంలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను కూడా అధ్యయనం చేయాలి. సొంతంగా నోట్స్ రాసుకుంటే మంచిది.
శిశు వికాసం-పెడగాజీ
ఈ విభాగం ిసిలబస్‌లోకి టెట్‌లో ఉన్న సైకాలజీని నేరుగా తీసుకున్నారు. విద్యా దృక్పథాలు, టీచింగ్ ఆప్టిట్యూడ్, ఫిలాసఫీలోని అంశాలతో పెడగాజీకి ప్రాధాన్యమిచ్చారు. తెలుగు అకాడమీ సైకాలజీ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధించవచ్చు.
ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించినది?
ఎ) జార్జ్ బిన్నేట్
బి) థర్‌స్టన్
సి) ఫ్రాయిడ్
డి) ఫోర్
సమాధానం: బి
తరగతిలో భావోద్రేక సమతుల్య వాతావరణాన్ని పెం పొందించేందుకు దోహదం చేసే ఉపాధ్యాయ చర్య?
ఎ) ప్రేరణ
బి) ఐక్యత
సి) చర్చ
డి) సమాచార ప్రసారం
సమాధానం: సి
తెలుగు
ఈ విభాగంలో 35 ప్రశ్నలకు 35 మార్కులు కేటాయించారు. కంటెంట్‌తో పాటు మెథడాలజీ కూడా ఉంటుంది. కంటెంట్‌లో ప్రధానంగా కవులు, రచయితలు, కావ్యాలు, రచనలు; క్రియా రూపాలు; భాషా రూపాలు; అపరిచిత పద్యం-గద్యం; వ్యాకరణంలోని వర్ణాలు ముఖ్యమైనవి. బోధనా పద్ధతులకు ప్రాధాన్యం ఇచ్చారు. సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఉపయోగపడతాయి.
తెలుగులో మొదటి దూషణ కావ్యం?
ఎ) మాతృ స్వరూపం
బి) ప్రభావతి విజయం
సి) మయూర చరిత్ర
డి) చంద్రరేఖా విలాసం
సమాధానం: డి
వ్యాకరణ బోధనకు అనువైన పద్ధతి?
ఎ) నియోజన పద్ధతి
బి) నిగమన పద్ధతి
సి) ఆగమన పద్ధతి
డి) చర్చా పద్ధతి
సమాధానం: సి
ఇంగ్లిష్
టెట్‌లో ఇంగ్లిష్ నుంచి 30 ప్రశ్నలు రాగా, ప్రస్తుత టెట్ కమ్ టీఆర్‌టీలో 35 ప్రశ్నలు వస్తాయి. కంటెంట్‌లో ప్రధానంగా గ్రామర్ నుంచి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్, వొకాబ్యులరీ, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వాయిస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మెథడాలజీలో Lesson planning, Phonetics, Aspects of teaching English తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.
ఉదా:
Which of the following is not a principle of language?
a) language is unique
b) language is symbolic
c) language is learned
d) language is static
Ans: d
He said, “May your daughter recover soon”. (Change into Indirect Speech)
a) He exclaimed that his daughter might recover soon
b) He said that might his daughter recover soon
c) He prayed/hoped that my daughter might recover soon.
d) He ordered that my daughter might recover soon
Ans: c
మ్యాథమెటిక్స్
ఈ విభాగంలో అర్థమెటిక్, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్, సంఖ్యామానం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశాలను, పదో తరగతి వరకు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. షార్ట్‌కట్స్ ద్వారా సమస్యల సాధనను ప్రాక్టీస్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
సరేఖీయాలైన మూడు బిందువుల ద్వారా గీయగల వృత్తాల సంఖ్య?
ఎ) 1
బి) 0
సి) 2
డి) 3
సమాధానం: బి
7 సెం.మీ. వ్యాసార్థం గల నాలుగు క్యారంబోర్డు కాయిన్లను ఒక్కొక్కటి రెండింటిని తాకినట్లు అమర్చిన, వాటి మధ్య ప్రదేశ వైశాల్యం? (చ.సెం.మీలలో..)
ఎ) 52
బి) 32
సి) 42
డి) 62
సమాధానం: సి
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-1
జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ కంటెంట్‌తో పాటు సోషల్ మెథడాలజీ అంశాలను సిలబస్‌లో చేర్చారు. జాగ్రఫీలో సౌర కుటుంబం, భూమి, ప్రధాన భూ స్వరూపాలు, శీతోష్ణస్థితి, పీడన మేఖలలు, జలావరణం, ప్రకృతి వైపరీత్యాలు, సహజసిద్ధ మండలాలు, ఖండాలు ముఖ్యమైన అంశాలు. ఈ విభాగంలో కొత్తగా చేర్చిన ఆస్ట్రేలియా ఖండం పాఠ్యాంశం.. 2012కు పూర్వం ఉన్న పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది. పీడనమేఖలలు పాఠ్యాంశాన్ని 9వ తరగతిలో చూడొచ్చు.
చరిత్రలో ప్రపంచ నాగరికతలు; జైన, బౌద్ధ మతాలు; శాతవాహన, మౌర్య, కాకతీయ, విజయనగరం, బహమనీ రాజ్యాల పరిపాలన, ఆర్థిక అంశాలను చదవాలి. ఢిల్లీ సుల్తానులు, మొగలు సామ్రాజ్యం, మహారాష్ట్రులు, సిక్కుల చరిత్రను కూడా అధ్యయనం చేయాలి. 1858-1947 మధ్య కాలంలో చోటుచేసుకున్న స్వాతం త్య్ర ఉద్యమ ఘటనలు, భారత జాతీయ కాంగ్రెస్, ఆధునిక ప్రపంచ చరిత్రతో పాటు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమాచారాన్ని తెలుసుకోవాలి.
పౌర శాస్త్రంలో భారత రాజ్యాంగం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; స్థానిక సంస్థలు; సార్క్, జీ-20 వంటి కూటముల గురించి అధ్యయనం చేయాలి. రోడ్డు భద్రత అంశాలను చదవడం తప్పనిసరి. ఆరో తరగతి నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాల్లోని కుటుంబం, సమాజం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల అంశాలను చదవాలి.
అర్థ శాస్త్రంలో డిమాండ్, సప్లయ్, మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు, జాతీయాదాయం, బడ్జెట్, పన్నులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఉన్నతి తరంగాలు అని వేటినంటారు?
ఎ) అనుదైర్ఘ్య తరంగాలు
బి) లఘువేల తరంగాలు
సి) పర్వవేల తరంగాలు
డి) కాంతి తరంగాలు
సమాధానం: సి
శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో గల ప్రధాన రేవు పట్టణం?
ఎ) భరుకచ్చం
బి) మోటుపల్లి
సి) మైసోలియా
డి) విశాఖపట్నం
సమాధానం: ఎ
రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
సమాధానం: ఎ
సంక్షేమ అర్థశాస్త్ర నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త?
ఎ) ఆడమ్ స్మిత్
బి) మార్షల్
సి) అమర్త్యసేన్
డి) రాబిన్‌సన్
సమాధానం: సి
సోషల్ మెథడాలజీ నుంచి స్వభావం, పరిధి, లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం-నిరంతర సమగ్ర మూల్యాంకనంతదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-2
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటెంట్‌తో పాటు సైన్స్ మెథడాలజీ అంశాలను సిలబస్‌లో ఇచ్చారు. బయాలజీ నుంచి విజ్ఞాన సంస్థలు, మొక్కలు-జంతువులు, మానవ శరీరం-ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యవసాయ పంటలు-వ్యాధులు, పర్యావరణం అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
కప్ప జీవిత చరిత్రలో రూపవిక్రియ ప్రక్రియను ప్రారంభించే హార్మోన్?
ఎ) ఎడ్రినలిన్
బి) కార్టిసాల్
సి) ఆల్డోస్టిరాన్
డి) థైరాక్సిన్
సమాధానం: డి
ఫిజికల్ సైన్స్ నుంచి కొలతలు, సహజ వనరులు, అయస్కాంతత్వం, ధ్వని, విద్యుత్, కాంతి, ఎలక్ట్రానిక్స్, రసాయన బంధం, సల్ఫర్-సమ్మేళనాలు, సంకేతాలు-ఫార్ములాలు-సమీకరణాలు తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
విద్యార్థి ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారుచేసేందుకు అవసరమైన పరికరాలను, రసాయనాలను ఎన్నుకుంటే సాధించిన లక్ష్యం?
ఎ) అవగాహన
బి) మూల్యాంకనం
సి) విశ్లేషణ
డి) సంశ్లేషణ
సమాధానం: ఎ
సన్నద్ధత:
మొదట ప్రతి సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి.
సరైన సమయపాలనను పాటించకుంటే కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయి, చివర్లో ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అందువల్ల సిలబస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని చదవడం ప్రధానం.
నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు గణితానికి సంబంధించి ఏడు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన సూత్రాలను, సంబంధిత సమస్యలను సాధించాలి. ప్రతి పాఠ్యాంశం చివర ఉన్న ముఖ్యాంశాలను తప్పనిసరిగా చదివి, గుర్తుపెట్టుకోవాలి.
అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉమ్మడి మెథడాలజీ పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. దీనికి డీఎడ్ తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి.
పాత సిలబస్ అని ఒకరంటే.. లేదు కొత్త సిలబస్ ఉంటుందని మరొకరు.. లేదు లేదు పాత, కొత్త కలిిపి సరికొత్త సిలబస్ అని ఇంకొకరు.. ఇలా ఇటీవల కాలంలో డీఎస్సీ ఔత్సాహికుల మధ్య సిలబస్‌పై పెద్ద చర్చే జరిగింది. వీటన్నింటికీ తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ‘టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్’ సిలబస్‌ను విడుదల చేసింది. టెట్, డీఎస్సీని కలిపిన నేపథ్యంలో రెంటింటికి సంబంధించిన సిలబస్‌తో కొత్త విధానంలో పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ సిలబస్‌పై విశ్లేషణతో పాటు ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్..
ఎస్జీటీ
ఎస్జీటీ
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | |
1. | జీకే, కరెంట్ అఫైర్స్ | 10 | 10 |
2. | శిశు వికాసం-పెడగాజీ | 30 | 30 |
3. | లాంగ్వేజ్ - 1(కంటెంట్, మెథడాలజీ) | 35 | 35 |
4. | ఇంగ్లిష్ (కంటెంట్, మెథడాలజీ) | 35 | 35 |
5. | మ్యాథ్స్(కంటెంట్, మెథడాలజీ) | 30 | 30 |
6. | ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-1 (జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ కంటెంట్; సోషల్ మెథడాలజీ) | 20 | 20 |
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-2 (బయాలజీ, ఫిజికల్ సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడాలజీ) | 20 | 20 |
భారీగా సిలబస్:
డీఎస్సీతో టెట్‌ను కలపడం వల్ల సిలబస్ భారీగా పెరిగింది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల కంటెంట్‌తో పాటు ఆయా సబ్జెక్టుల మెథడాలజీలను అధ్యయనం చేయాల్సి రావడంతో అభ్యర్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే గతంతో పోల్చితే ప్రస్తుత డీఎస్సీకి కొంత ఎక్కువ సమయం అందుబాటులో ఉంది కాబట్టి సరైన ప్రణాళిక ప్రకారం చదివితే విజయం సాధించడం కష్టమేమీ కాదు.
జీకే, కరెంట్ అఫైర్స్
స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అంతర్జాతీయ సదస్సులు, రాజ్యాంగ సవరణలు, ముఖ్యమైన తేదీలు, ప్రధాన స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు-గ్రహీతలు తదితర అంశాలను చదవాలి. వార్తా పత్రికలు చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించవచ్చు. ఇటీవల కాలంలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను కూడా అధ్యయనం చేయాలి. సొంతంగా నోట్స్ రాసుకుంటే మంచిది.
శిశు వికాసం-పెడగాజీ
ఈ విభాగం ిసిలబస్‌లోకి టెట్‌లో ఉన్న సైకాలజీని నేరుగా తీసుకున్నారు. విద్యా దృక్పథాలు, టీచింగ్ ఆప్టిట్యూడ్, ఫిలాసఫీలోని అంశాలతో పెడగాజీకి ప్రాధాన్యమిచ్చారు. తెలుగు అకాడమీ సైకాలజీ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధించవచ్చు.
ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించినది?
ఎ) జార్జ్ బిన్నేట్
బి) థర్‌స్టన్
సి) ఫ్రాయిడ్
డి) ఫోర్
సమాధానం: బి
తరగతిలో భావోద్రేక సమతుల్య వాతావరణాన్ని పెం పొందించేందుకు దోహదం చేసే ఉపాధ్యాయ చర్య?
ఎ) ప్రేరణ
బి) ఐక్యత
సి) చర్చ
డి) సమాచార ప్రసారం
సమాధానం: సి
తెలుగు
ఈ విభాగంలో 35 ప్రశ్నలకు 35 మార్కులు కేటాయించారు. కంటెంట్‌తో పాటు మెథడాలజీ కూడా ఉంటుంది. కంటెంట్‌లో ప్రధానంగా కవులు, రచయితలు, కావ్యాలు, రచనలు; క్రియా రూపాలు; భాషా రూపాలు; అపరిచిత పద్యం-గద్యం; వ్యాకరణంలోని వర్ణాలు ముఖ్యమైనవి. బోధనా పద్ధతులకు ప్రాధాన్యం ఇచ్చారు. సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఉపయోగపడతాయి.
తెలుగులో మొదటి దూషణ కావ్యం?
ఎ) మాతృ స్వరూపం
బి) ప్రభావతి విజయం
సి) మయూర చరిత్ర
డి) చంద్రరేఖా విలాసం
సమాధానం: డి
వ్యాకరణ బోధనకు అనువైన పద్ధతి?
ఎ) నియోజన పద్ధతి
బి) నిగమన పద్ధతి
సి) ఆగమన పద్ధతి
డి) చర్చా పద్ధతి
సమాధానం: సి
ఇంగ్లిష్
టెట్‌లో ఇంగ్లిష్ నుంచి 30 ప్రశ్నలు రాగా, ప్రస్తుత టెట్ కమ్ టీఆర్‌టీలో 35 ప్రశ్నలు వస్తాయి. కంటెంట్‌లో ప్రధానంగా గ్రామర్ నుంచి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్, వొకాబ్యులరీ, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వాయిస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మెథడాలజీలో Lesson planning, Phonetics, Aspects of teaching English తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.
ఉదా:
Which of the following is not a principle of language?
a) language is unique
b) language is symbolic
c) language is learned
d) language is static
Ans: d
He said, “May your daughter recover soon”. (Change into Indirect Speech)
a) He exclaimed that his daughter might recover soon
b) He said that might his daughter recover soon
c) He prayed/hoped that my daughter might recover soon.
d) He ordered that my daughter might recover soon
Ans: c
మ్యాథమెటిక్స్
ఈ విభాగంలో అర్థమెటిక్, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్, సంఖ్యామానం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశాలను, పదో తరగతి వరకు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. షార్ట్‌కట్స్ ద్వారా సమస్యల సాధనను ప్రాక్టీస్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
సరేఖీయాలైన మూడు బిందువుల ద్వారా గీయగల వృత్తాల సంఖ్య?
ఎ) 1
బి) 0
సి) 2
డి) 3
సమాధానం: బి
7 సెం.మీ. వ్యాసార్థం గల నాలుగు క్యారంబోర్డు కాయిన్లను ఒక్కొక్కటి రెండింటిని తాకినట్లు అమర్చిన, వాటి మధ్య ప్రదేశ వైశాల్యం? (చ.సెం.మీలలో..)
ఎ) 52
బి) 32
సి) 42
డి) 62
సమాధానం: సి
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-1
జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ కంటెంట్‌తో పాటు సోషల్ మెథడాలజీ అంశాలను సిలబస్‌లో చేర్చారు. జాగ్రఫీలో సౌర కుటుంబం, భూమి, ప్రధాన భూ స్వరూపాలు, శీతోష్ణస్థితి, పీడన మేఖలలు, జలావరణం, ప్రకృతి వైపరీత్యాలు, సహజసిద్ధ మండలాలు, ఖండాలు ముఖ్యమైన అంశాలు. ఈ విభాగంలో కొత్తగా చేర్చిన ఆస్ట్రేలియా ఖండం పాఠ్యాంశం.. 2012కు పూర్వం ఉన్న పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది. పీడనమేఖలలు పాఠ్యాంశాన్ని 9వ తరగతిలో చూడొచ్చు.
చరిత్రలో ప్రపంచ నాగరికతలు; జైన, బౌద్ధ మతాలు; శాతవాహన, మౌర్య, కాకతీయ, విజయనగరం, బహమనీ రాజ్యాల పరిపాలన, ఆర్థిక అంశాలను చదవాలి. ఢిల్లీ సుల్తానులు, మొగలు సామ్రాజ్యం, మహారాష్ట్రులు, సిక్కుల చరిత్రను కూడా అధ్యయనం చేయాలి. 1858-1947 మధ్య కాలంలో చోటుచేసుకున్న స్వాతం త్య్ర ఉద్యమ ఘటనలు, భారత జాతీయ కాంగ్రెస్, ఆధునిక ప్రపంచ చరిత్రతో పాటు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమాచారాన్ని తెలుసుకోవాలి.
పౌర శాస్త్రంలో భారత రాజ్యాంగం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; స్థానిక సంస్థలు; సార్క్, జీ-20 వంటి కూటముల గురించి అధ్యయనం చేయాలి. రోడ్డు భద్రత అంశాలను చదవడం తప్పనిసరి. ఆరో తరగతి నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాల్లోని కుటుంబం, సమాజం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల అంశాలను చదవాలి.
అర్థ శాస్త్రంలో డిమాండ్, సప్లయ్, మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు, జాతీయాదాయం, బడ్జెట్, పన్నులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఉన్నతి తరంగాలు అని వేటినంటారు?
ఎ) అనుదైర్ఘ్య తరంగాలు
బి) లఘువేల తరంగాలు
సి) పర్వవేల తరంగాలు
డి) కాంతి తరంగాలు
సమాధానం: సి
శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో గల ప్రధాన రేవు పట్టణం?
ఎ) భరుకచ్చం
బి) మోటుపల్లి
సి) మైసోలియా
డి) విశాఖపట్నం
సమాధానం: ఎ
రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
సమాధానం: ఎ
సంక్షేమ అర్థశాస్త్ర నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త?
ఎ) ఆడమ్ స్మిత్
బి) మార్షల్
సి) అమర్త్యసేన్
డి) రాబిన్‌సన్
సమాధానం: సి
సోషల్ మెథడాలజీ నుంచి స్వభావం, పరిధి, లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం-నిరంతర సమగ్ర మూల్యాంకనంతదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-2
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటెంట్‌తో పాటు సైన్స్ మెథడాలజీ అంశాలను సిలబస్‌లో ఇచ్చారు. బయాలజీ నుంచి విజ్ఞాన సంస్థలు, మొక్కలు-జంతువులు, మానవ శరీరం-ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యవసాయ పంటలు-వ్యాధులు, పర్యావరణం అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
కప్ప జీవిత చరిత్రలో రూపవిక్రియ ప్రక్రియను ప్రారంభించే హార్మోన్?
ఎ) ఎడ్రినలిన్
బి) కార్టిసాల్
సి) ఆల్డోస్టిరాన్
డి) థైరాక్సిన్
సమాధానం: డి
ఫిజికల్ సైన్స్ నుంచి కొలతలు, సహజ వనరులు, అయస్కాంతత్వం, ధ్వని, విద్యుత్, కాంతి, ఎలక్ట్రానిక్స్, రసాయన బంధం, సల్ఫర్-సమ్మేళనాలు, సంకేతాలు-ఫార్ములాలు-సమీకరణాలు తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
విద్యార్థి ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారుచేసేందుకు అవసరమైన పరికరాలను, రసాయనాలను ఎన్నుకుంటే సాధించిన లక్ష్యం?
ఎ) అవగాహన
బి) మూల్యాంకనం
సి) విశ్లేషణ
డి) సంశ్లేషణ
సమాధానం: ఎ
సన్నద్ధత:
మొదట ప్రతి సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి.
సరైన సమయపాలనను పాటించకుంటే కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయి, చివర్లో ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అందువల్ల సిలబస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని చదవడం ప్రధానం.
నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు గణితానికి సంబంధించి ఏడు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన సూత్రాలను, సంబంధిత సమస్యలను సాధించాలి. ప్రతి పాఠ్యాంశం చివర ఉన్న ముఖ్యాంశాలను తప్పనిసరిగా చదివి, గుర్తుపెట్టుకోవాలి.
అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉమ్మడి మెథడాలజీ పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. దీనికి డీఎడ్ తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి.
Published date : 04 Dec 2014 06:17PM