ఏపీలో 16వేలకు పైగా ఉపాధ్యాయ కొలువులకు నోటిఫికేషన్.. ప్రిపరేషన్ సాగించండిలా..!
ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా డీఎస్సీకి అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్...
తొలుత టెట్..
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్ రెండుసార్లు నిర్వహించిన తర్వాత మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తున్నారు. వీరంతా డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే.. టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో తొలుత టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి టెట్ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. చివరిసారి నిర్వహించిన టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా.. 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు మించే అవకాశం ఉంది.
ఇంగ్లిష్ నైపుణ్యాలకు పరీక్ష..
టెట్, డీఎస్సీ సిలబస్‌లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో.. ఆంగ్లంలో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీకి ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సిలబస్ రూపొందిస్తోంది. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్‌లోనూ మార్పులు జరిగే ఆస్కారముంది.
ఇంకా చదవండి: part 2: టెట్ కమ్ టీఆర్‌టీ.. అర్హత వివరాలు తెలుసుకోండిలా..