Skip to main content

డిసెంబర్ 15 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేంజెస్, నాన్ లాంగ్వేంజెస్) అభ్యర్థులు డిసెంబర్ 15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు.
అలాగే పిజిటి, టిజిటి, ఎల్పిటీ, పిఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్‌‌ట్స అండ్ డ్రాయింగ్ అభ్యర్థులు డిసెంబర్ 20 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. https://cse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్‌జీటీ అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి 24 వరకు సెంటర్ల ఎంపికకు సంబంధించి ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. 2019 జనవరి 10 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషనర్ కె.సంధ్యారాణి స్పష్టం చేశారు.
Published date : 13 Dec 2018 01:48PM

Photo Stories