Skip to main content

డీఎస్సీలో విజయానికి వ్యూహాలు...

ఖాళీలు తక్కువ, పోటీ ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర కెరీర్‌ను చేజిక్కించే ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో విజయానికి సూచనలు...
అర్హతలు, పరీక్ష విధానం...
  • స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్, ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నిర్వహిస్తారు.
  • సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి టెట్ కమ్ టీఆర్‌టీ ఉంటుంది. పరీక్షలు ఆన్‌లైన్ విధానం (సీబీటీ)లో జరుగుతాయి.

విద్యార్హతలు :
ఎస్‌జీటీ: ఇంటర్మీడియెట్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)/డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) (లేదా) కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ.
స్కూల్ అసిస్టెంట్: ఆయా సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత. ఎస్‌ఏ-లాంగ్వెజెస్, ఎల్‌పీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఇతర పోస్టులకు ఆయా పోస్టులను బట్టి అకడమిక్, టీచింగ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉండాలి.
వయసు: 18-44 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టులు-మార్కుల వెయిటేజీ :
స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీ:
మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-80 మార్కులు; ఏపీ టెట్-20 మార్కులు).
స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-50 మార్కులు, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్-30 మార్కులు, ఏపీ టెట్-20 మార్కులు).
మ్యూజిక్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-70 మార్కులు, స్కిల్ టెస్ట్-30 మార్కులు).
ప్రిన్సిపల్, పీజీటీ, క్రాఫ్ట్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ).
ఎస్‌జీటీ: మొత్తం 100 మార్కులు (టెట్ కమ్ టీఆర్‌టీ).

ఎస్‌జీటీ-టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష విధానం :

 

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

1.

జీకే అండ్ కరెంట్ అఫైర్స్

20

10

2.

విద్యా దృక్పథాలు

10

5

3.

విద్యా మనోవిజ్ఞానశాస్త్రం

20

10

4.

లాంగ్వేజ్-1 (ఆప్షనల్)

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

5.

లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్)

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

6.

మ్యాథమెటిక్స్

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

7.

సైన్స్

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

8.

సోషల్ స్టడీస్

 

 

 

కంటెంట్

20

10

 

మెథడాలజీ

10

5

 

మొత్తం

200

100

  • పరీక్షకు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్‌‌స, బయాలజీ, సోషల్ స్టడీస్ తదితర) (టీఆర్‌టీ) :

 

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

1.

జీకే అండ్ కరెంట్ అఫైర్స్

20

10

2.

విద్యా దృక్పథాలు

10

5

3.

విద్యా మనోవిజ్ఞానశాస్త్ర

 

 

 

తరగతి గది అన్వయం

10

5

4.

సంబంధిత సబ్జెక్టు

 

 

 

కంటెంట్

80

40

 

మెథడాలజీ

40

20

 

మొత్తం

160

80

  • పరీక్షకు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

సన్నద్ధమవ్వండిలా...
ఎస్‌జీటీ :
జీకే, కరెంట్ అఫైర్స్:
తొలుత సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. ఆపై సబ్జెక్టుల వారీ వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించుకొని, అధ్యయనం చేయాలి.
  • స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు-రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ అంశాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తదితరాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్‌కు పత్రికలను ఉపయోగించుకోవాలి.
    విద్యా దృక్పథాలు: దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం (ఎన్‌సీఎఫ్-2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.
    విద్యా మనోవిజ్ఞానశాస్త్రం: శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన-స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.
    కంటెంట్: తెలుగు (ఆప్షనల్), ఇంగ్లిష్, మ్యాథమె టిక్స్, సైన్స్, సోషల్‌స్టడీస్ సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు-కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతో పాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి.
  • గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కుల సాధనకు వీలవుతుంది.
  • సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు-క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి.
  • సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ-బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం-సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు.

మెథడాలజీ: ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకంటూ చదవాలి. సొంత నోట్స్ రూపకల్పనతో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.
స్కూల్ అసిస్టెంట్ :
  • ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి.
  • బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
  • సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు-అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలపై దృష్టిసారించాలి.
మెథడాలజీ: ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. గత డీఎస్సీలో గణితంలో బోధనా పద్ధతులు; సోషల్‌స్టడీస్‌లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యం లభించగా బయాలజీలో అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు వచ్చాయి.

మాక్‌టెస్ట్‌లతో మేలు..
కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు-స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ ముఖ్యం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్‌లైన్లో పరీక్షలు జరుగుతాయి కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది.
- జె.సుధాకర్, డెరైక్టర్, ప్రతిభ కోచింగ్ సెంటర్, విజయవాడ.

Published date : 29 Oct 2018 04:55PM

Photo Stories