Skip to main content

డీఎస్సీ దరఖాస్తు తప్పులు సరిచేసుకునేందుకు అవకాశం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018కి సంబంధించి దరఖాస్తు సమయంలో టెట్ హాల్ టికెట్ నంబర్లు తప్పుగా రాసిన అభ్యర్థులకు వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు.
అభ్యర్థుల నుంచి పెద్దసంఖ్యలో విజ్ఞప్తులొచ్చిన నేపథ్యంలో మరోసారి సవరణకు అవకాశమిచ్చినట్టు నవంబర్ 29న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 4 అర్ధరాత్రి వరకు https://apdscreports183296.apcfss.in/apdscupdatePreviousTetDetails271118440.dsc వెబ్‌సైట్‌లో టెట్ హాల్ టికెట్ నంబర్లలో సవరణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అభ్యర్థుల మొబైల్స్‌కు డిసెంబర్ 5న సంక్షిప్త సందేశాలు పంపుతామని, వారు 6న సెంటర్‌కు సంబంధించి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. డెమోగ్రఫీ వివరాలు (పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నంబర్, ఈమెయిల్..) సరిచేసుకోవాలనే అభ్యర్థులు సైతం తమ వివరాల్ని కమిషనర్ వెబ్‌సైట్‌లో ఉన్న ఫిర్యాదు బాక్సులో ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లయితే సరిచేస్తామని సంధ్యారాణి తెలిపారు.
Published date : 30 Nov 2018 11:49AM

Photo Stories