డీఎస్సీ-2018 పరీక్షల షెడ్యూల్ వాయిదా
ప్రభుత్వం డీఎస్సీ-2018 అభ్యర్థులకు షాక్‌ల మీద షాకులను ఇస్తోంది. రెండేళ్లపాటు ఊరించి అభ్యర్థులను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పింది. తీరా అరకొర పోస్టులతో అభ్యర్థులకు చుక్కలు చూపించింది. ప్రకటన వచ్చిన రోజు నుంచి ఏదో ఒక సాకుతో ఎస్‌జీటీ పోస్టుల్లో కోతలు విధిస్తోంది. ఇన్ని తక్కువ పోస్టులతో డీఎస్సీ విడుదల చేయడం కన్నా మానుకోవడమే మేలని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. ఎస్‌జీటీ పోస్టులు భారీగా ఖాళీలున్నా.. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదంటూ కేవలం 4,221 పోస్టులను విడుదల చేసింది. పీఈటీల పోస్టులను పెంచేసాకుతో 250 ఎస్‌జీటీలను కోతపెట్టింది. తాజాగా డిప్యూటీ డీవైఈఓల నియామకం పేరుతో మరో 366 పోస్టులను తగ్గించడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు ఈ డీఎస్సీలో బీఈడీలను అనుమతించడం, టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహించడంతో పోటీ మరింత పెరిగింది.
పాఠశాల విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్‌లోని మార్పులు ఇలా...
పాత షెడ్యూల్ | కొత్త షెడ్యూల్ |
స్కూల్ అసిస్టెంట్స్(నాన్ లాంగ్వేజెస్): | స్కూల్ అసిస్టెంట్స్(నాన్ లాంగ్వేజెస్): |
డిసెంబరు 6, 10 తేదీల్లో (2 రోజులు) | డిసెంబరు 24, 26, 27వ తేదీల్లో(3 రోజులు) |
స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్): | స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్): |
డిసెంబరు 11న (1 రోజు) | డిసెంబరు 28న (1 రోజు) |
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్: | పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్: |
డిసెంబరు 12,13 తేదీల్లో (2రోజులు) | డిసెంబరు 29న (1రోజు) |
ట్రయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్స్: | ట్రయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీఈటీ: |
డిసెంబరు 14, 26 తేదీల్లో (2 రోజులు) | డిసెంబరు 30, 31, జనవరి 1 (3 రోజులు) |
పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ డ్రాయింగ్ టీచర్సు: | ప్రిన్సిపల్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్: |
డిసెంబరు 17న (1 రోజు) | జనవరి 2న(1 రోజు) |
లాంగ్వేజ్ పండిట్స్: | లాంగ్వేజ్ పండిట్స్: |
డిసెంబరు 27న | జనవరి 3న (1 రోజు) |
సెకండరీ గ్రేడ్ టీచర్లు: | సెకండరీ గ్రేడ్ టీచర్లు: |
డిసెంబరు 28 - జనవరి 2 వరకు (6రోజులు) | జనవరి 18- జనవరి 30 వరకు (13రోజులు) |
డీఎస్సీ ప్రాథమిక కీ, ఫైనల్ కీ, సెలెక్షన్ జాబితా విడుదల తేదీలు :
సబ్జెక్ట్ | ప్రాథమిక కీ | అభ్యంతరాలు | ఫైనల్‌కీ | ఫలితాలు | మెరిట్ లిస్ట్ | సెలక్షన్‌లిస్ట్ |
ఎస్‌ఏ | 27-12-18 | డిసెంబరు27నుంచి జనవరి 3 వరకు | 07-01-19 | 10-01-19 | 13-01-19 | 17-01-19 |
పీజీటీ | 29-12-18 | డిసెంబరు29నుంచి జనవరి 5వరకు | 09-01-19 | 12-01-19 | 14-01-19 | 19-01-19 |
టీజీటీ, ప్రిన్సిపాల్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ | 02-01-19 | 02-01-19నుంచి 09-01-19వరకు | 13-01-19 | 17-01-19 | 20-01-19 | 23-01-19 |
ఎల్‌పీ | 03-01-19 | 03-01-19 నుంచి 10-01-19 వరకు | 14-01-19 | 18-01-19 | 21-01-19 | 24-01-19 |
ఎస్‌జీటీ | 30-01-19 | 30-1-19 నుంచి 06-02-19 వరకు | 10-02-19 | 14-02-19 | 17-02-19 | 21-02-19 |