Skip to main content

డీఎస్సీ-2018 దరఖాస్తు సవరణ గడువు డిసెంబర్ 6 వరకు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018 ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల సవరణకు డిసెంబర్ 6 వరకు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
కులం, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మీడియం, సబ్జెక్టు, పోస్టులతోపాటు మెరిటోరియస్ స్పోర్‌‌ట్స, మాజీ సైనికులు, ప్రత్యేక ప్రతిభావంతుల అంశాలకు సంబంధించి అభ్యర్థులు తప్పుగా రాసినట్లయితే వాటిని సవరించుకోవచ్చని పేర్కొన్నారు. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల బాక్సులోకి వెళ్లి తమ తప్పులను నమోదు చేసుకోవాలన్నారు. నమోదులను సవరించి సంక్షిప్త సందేశాలు పంపుతామన్నారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం నుంచి 6వతేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు పొరపాట్లను నమోదు చేసుకోవాలన్నారు.
Published date : 05 Dec 2018 01:32PM

Photo Stories