Skip to main content

TET: ఉపాధ్యాయులకు టెట్‌ టెన్షన్‌!

Nalgonda Teachers at TET Exam   Nalgonda No govt teacher can get promotion without passing TET  Education Department Announcement on TET Promotions  SERT Rules on TET Promotion

అర్హత సాధిస్తేనే పదోన్నతులు..

  • కొత్త నిబంధన తెచ్చిన ఎస్‌ఈఆర్‌టీ
  • ప్రత్యేక టెట్‌ నిర్వహించాలంటున్న టీచర్లు
  • ప్రమోషన్ల కోసం రెండువేల మంది నిరీక్షణ

పరీక్ష ఇబ్బందికరమే..
ఎప్పుడో ఉద్యోగాలు పొందిన వారుసైతం ఇప్పుడు టెట్‌ ఉత్తీర్ణత ఉండాలని చెబుతుండడంతో ఉపాధ్యాయులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టెట్‌ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓసీలు 90 శాతం, బీసీలు 60 శాతం, ఎస్సీలు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే టెట్‌ పేపర్‌–1 ఉత్తీర్ణత కావాలంటే చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, పర్యావరణానికి సంబంధించిన అంశాలు చదవడం చాలా ఇబ్బందికరం అంటున్నారు. పేపర్‌–2లో కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అవన్నీ తాము చదవలేమని తమకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

నల్లగొండ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) టెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. టెట్‌ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎస్‌ఈఆర్‌టీ నిబంధనలు విధించింది. ఎప్పుడో ఉద్యోగాలు పొందిన తాము ప్రస్తుతం పదోన్నతులు పొందేందుకు టెట్‌ తప్పనిసరి పాస్‌ కావాలనేని నిబంధన పెట్టడడం ఏమిటని ఉపాధ్యాయులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రస్తుతం టెట్‌ అర్హత సాధించడం సాధ్యమయ్యే పని కాదని, మా కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ, విద్యా శాఖ మాత్రం డీఎడ్‌, బీఈడీ అభ్యర్థులతో పాటే ప్రస్తుత ఉపాధ్యాయులు కూడా టెట్‌ రాయాల్సిందేనని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ నెలలో టెట్‌ నిర్వహించిన తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు ఉంటాయని విద్యా శాఖ చెబుతోంది. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

2010లోనే టెట్‌ ఉత్తర్వులు జారీ
జిల్లాలో దాదాపు 3,207 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఎస్‌జీటీలు 2,754 మంది వరకు ఉన్నారు. ఇందులో దాదాపు 2వేల మంది వరకు టెట్‌ రాయాల్సి ఉంటుంది. కొందరైతే రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారు. అలాంటి వారు టెట్‌ పాస్‌ కావాలనడం పెద్ద సమస్యగా మారింది. అయితే అప్పట్లో టెట్‌ లేకుండానే ఉద్యోగాలు పొందిన ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు ఏళ్ల తరబడిగా పాఠశాలల్లో బోధన చేస్తూవస్తున్నారు. వీరిలో చాలా మంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరు టెస్‌ పాసైతేనే పదోన్నతులకు అర్హులని జాతీయ ఉపాధ్యాయ మండలి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టెట్‌ రాయాల్సిందేనని 2010లోనే విద్యాశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.

Published date : 08 Apr 2024 04:10PM

Photo Stories