TET: దరఖాస్తుల గడువు పెంచాలి
Sakshi Education
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) గడువు పొడిగించాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇప్పటికే లక్షలాది మంది బీఈడీ అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయారని, దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా ఆలోచించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
చదవండి:
టెట్‌లో 120+ మార్కులు గ్యారంటీ కొట్టే మార్గం ఇదే.. ||TET Best Preparation Tips, Books, Syllabus
TS TET 2022 Preparation Tips : టెట్‌లో ఉత్తమ స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుందా?
TSTET Syllabus 2022
Published date : 22 Apr 2022 04:28PM