Skip to main content

APSSDC: విదేశీ ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సాక్షి, అమరావతి: మధ్యప్రాచ్యం, యూరోపియన్‌ యూనియన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలను గుర్తించి దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో ని యువతకు శిక్షణ ఇచ్చేలా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) వివిధ సంస్థలతో ఒ ప్పందం కుదుర్చుకుంటోంది.
APSSDC
విదేశీ ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఇప్పటికే ఓమ్‌క్యాప్, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ, టీఏకేటీ ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేసేలా ఒప్పందం చేసుకుంది. తాజాగా ఇంటర్నేషనల్‌ అగ్రిగేషన్‌ ప్లాట్‌ఫాం ఫర్‌ మొబిలిటీ (ఇన్‌లామ్‌ మోబీ)తోనూ ఒప్పందం చేసుకుంది. వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలపై ఇన్‌లామ్‌ మోబీతో కలిసి పనిచేయనున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో వినోద్‌కుమార్‌ తెలిపారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలను తెలుసుకోవడానికి పలు దేశాల రాయబారులతో త్వరలోనే న్యూఢిల్లీలో ఔట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. 

చదవండి:

Foreign Education : ఇక్కడ సీటొస్తే చాలు.. ఎంచ‌క్కా..విదేశాల్లో చదవొచ్చు ఇలా..

Student Visa in Canada : మోసానికి గురైన విద్యార్థులకు మేము ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటాం..

Published date : 30 Jun 2023 04:09PM

Photo Stories