Skip to main content

Overseas Jobs: విదేశీ ఉద్యోగాల కోసం పేర్ల నమోదు

జగిత్యాలటౌన్‌: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టామ్‌కామ్‌) ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగాల కోసం ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి బి.సత్యమ్మ తెలిపారు.
Overseas Jobs
విదేశీ ఉద్యోగాల కోసం పేర్ల నమోదు

ఈమేరకు ఆగ‌స్టు 2న‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియా దేశంలోని మైనింగ్‌, ఇండస్ట్రియల్‌ ప్లాంట్‌లో మెకానిక్‌, మెకానికల్‌ ఫిట్టర్‌, మెకానికల్‌ ఇంజినీర్‌, కన్వేయర్‌ బెల్ట్‌ టెక్నీషియన్‌, మిషనిస్ట్‌, వెల్డర్‌, బాయిలర్‌ మేకర్‌, ఫ్యాబ్రికేటర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

జర్మనీ దేశంలో మీట్‌ ప్రాసెసింగ్‌, ఫుడ్‌ రిటైల్‌ సేల్స్‌ కన్సస్ట్రక్షన్‌, సాంకేతిక రంగ ఎలక్ట్రానిక్స్‌, మెటల్‌ బిల్డర్‌, మోడల్‌ బిల్డర్‌ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. 60శాతం మార్కులతో ఇంటర్‌ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్‌ కలిగిఉన్నవారు అర్హులని వివరించారు. అనుభవం అవసరం లేదని స్పష్టం చేశారు.

చదవండి: Australia Says No To TOEFL: ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్నారా... ఇక టోఫెల్ కి చెక్!

వరంల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 5న పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం టామ్‌కామ్‌, మొబైల్‌ నంబర్లు 97017 32697, 78935 66493 లేదా www.otmcom. telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.

Published date : 03 Aug 2023 03:22PM

Photo Stories