Student Visa in Canada : మోసానికి గురైన విద్యార్థులకు మేము ఎల్లప్పుడు అండగా ఉంటాం..
కెనడా రాకకు పారదర్శకమైన మార్గాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము అని, మానవతా దృక్పథంతో నిజమైన విద్యార్థులకు టెంపరరీ రెసిడెంట్ పర్మిట్ ఇస్తామని కెనడా మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యాసంస్థల వివరాలను పరిశోధన చేయాలి :
మోసానికి గురవ్వకుండా అప్రమత్తంగా ఉండమని విద్యార్థులను కోరుతూ, దరఖాస్తుదారులందరూ స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసే ముందు, విద్యాసంస్థల వివరాలను పరిశోధన చేయాలని, డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (DLI) నుంచి అంగీకార పత్రాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలని ఫ్రేజర్ అన్నారు, మా ప్రోగ్రామ్‌ల పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను చూడవలిసిందిగా కోరారు.
➤☛ విదేశీ భాషలు...ఉజ్వల కెరీర్‌కు బాటలు !
ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు ప్రక్రియలో జాగ్రత్త :
మీరు కన్సల్టెంట్‌లచే మోసపోయారని మీరు విశ్వసిస్తే, ధైర్యంగా ముందుకు వచ్చి వారి మోసాన్ని మాకు నివేదించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము.
విద్యార్థులు వారి స్టడీ పర్మిట్ దరఖాస్తులో భాగంగా సమర్పించిన విద్యాసంస్థల అంగీకార లేఖలు మోసపూరితమైనవిగా నిర్ధారించబడిన తర్వాత కెనడా నుంచి వెనుకకు పంపుతున్న అంతర్జాతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ల వివరాలు తమవద్ద ఉన్నాయని, కెనడా మంత్రి తెలిపారు.
ఈ అంతర్జాతీయ విద్యార్థులలో చాలా మంది, కెనడాలోని ప్రపంచ స్థాయి సంస్థలలో కొన్నింటిలో తమ చదువులను కొనసాగించేందుకు కెనడాకు వచ్చారని కాని వారి ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు ప్రక్రియలో వారికి సహాయం చేస్తున్నామని చెప్పి కొందరు వారిని మోసగించారని కెనడా మంత్రి అన్నారు
కొంత మంది విదేశీ పౌరులకు ఉన్నత విద్యను అభ్యసించే ఉద్దేశ్యం లేకపోయిన కెనడా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ప్రయోజనాన్ని పొందడానికి మోసపూరిత అంగీకార పత్రాలను ఉపయోగించారు. ఈ వ్యక్తులలో కొందరు వ్యవస్థీకృత నేరాలలో పాలుపంచుకున్నారు.
నా అధికారాలన్నింటిని ఉపయోగిస్తా :
ఈ మోసపూరితమైన వ్యక్తుల వల్ల బాధపడేవారిని నేను అర్థం చేసుకున్నాను అలాగే వారి శ్రేయస్సు చాలా ముఖ్యమైనదని నేను వారికి హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మోసానికి గురైన బాధితులను గుర్తించడానికి నా అధికారుల టాస్క్ ఫోర్స్‌ను కెనడాతో సన్నిహితంగా పని చేయమని నేను వారిని కోరాను.
మోసానికి పాల్పడని అంతర్జాతీయ విద్యార్థులు బహిష్కరణకు గురికారని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను అని ఫ్రేజర్ స్పష్టం చేశారు.
ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ యాక్ట్ నాకు అన్ని అధికారాలను అందిస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ఉపయోగించాలని నేను విశ్వసిస్తున్నాను.
అందుకే.. ఒక అంతర్జాతీయ విద్యార్థి కెనడాకు అధ్యయనం చేయాలనే ఉద్దేశ్యంతో మోసపూరిత డాక్యుమెంటేషన్‌లతో తెలియకుండానే వస్తే వారికి తాత్కాలిక నివాస అనుమతిని జారీ చేయమని నేను అధికారులకు సూచించాను.
దీని వల్ల నిజమైన విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు కెనడాలోనే ఉండగలరని అలాగే వీరికి తప్పుగా ప్రవేశించిన వారికి సాధారణంగా విధించే ఐదేళ్ల నిషేధం కూడా ఉండదు.
ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు సమీక్షలో ఉన్న ఎవరికైనా తమ బహిష్కరణను ఆపడానికి ప్రాథమిక తాత్కాలిక నివాస అనుమతులు జారీ చేయబడతాయి.
ఇమ్మిగ్రేషన్ మోసాలను అడ్డుకోవాలని అధికారులకు పిలుపు :
అలాగే ఇమ్మిగ్రేషన్ మంత్రి ఫ్రేజర్ మాట్లాడుతూ ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీలు, సిటిజెన్‌షిప్ కెనడా (IRCC), ప్రావిన్సులు, టెరిటరీలు, కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మోసాలను మెరుగ్గా గుర్తించి వాటిని ఎదుర్కోవాలని ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ల సమగ్రతను నిలబెట్టాలని అధికారులను కోరారు .
కెనడా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేయాలని కోరుకునే మోసపూరిత కన్సల్టెంట్‌లను అణిచివేసేందుకు మరియు కెనడాలో సందర్శించడానికి, పని చేయడానికి, అధ్యయనం చేయడానికి లేదా స్థిరపడాలని కోరుకునే వారి ప్రయోజనాన్ని కాపాడటానికి మేము ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాము.
ఒకే సంస్ధ ద్వార దరఖాస్తులు :
ఇంతకుముందు విద్యా సంస్థల అడ్మిషన్, ఆఫర్ లెటర్లు నకిలీవని తేలిన విద్యార్థులను CBSA (కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ) బహిష్కరణ నోటీసులు జారీ చేసింది.
వీరందరు పరారీలో ఉన్న బ్రిజేష్ మిశ్రా నేతృత్వంలోని జలంధర్‌లోని ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ ద్వారా 2018 నుండి 2022 వరకు వీసా దరఖాస్తులను దాఖలు చేశారు.బ్రిజేష్ మిశ్రా విద్యార్థులను వేలల్లో మోసం చేశారనే ఆరోపణలున్నాయి.
శాశ్వత నివాసం దరఖాస్తుతో మోసాలు వెలుగులోకి :
స్టడీ వీసాపై కెనడాకు వెళ్లిన విద్యార్థులు ఇటీవల శాశ్వత నివాసం(పీఆర్) కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి.కెనడా ప్రభుత్వం దృష్టి మోసపూరిత కార్యకలాపాలకు కారణమైన వారిని గుర్తించడంపై ఉంది కాని మోసం ద్వారా ప్రభావితమైన వారికి జరిమానా విధించడంపై కాదు.