Skip to main content

KTR: ప్రభుత్వోద్యోగ గణాంకాలతో వెబ్‌సైట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్‌ www.telanganajobstats.in ను మంత్రి కె. తారక రామారావు న‌వంబ‌ర్‌ 21న‌ ప్రారంభించారు.
KTR introduces website showcasing filled state government jobs, Minister K. Taraka Rama Rao launching www.telanganajobstats.in, Special website www.telanganajobstats.in for state government job details, Website with government employment statistics, Check out www.telanganajobstats.in for latest government job updates,

 ప్రభుత్వోద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్‌... దీనిపై వాస్తవ సమాచారాన్ని వెల్లడించేందుకే ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

చదవండి: SSC JE 2023 Notification: కేంద్రంలో 1324 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఉద్యోగాల భర్తీ వివరాలను అందులో పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని, వాటిలో 1.60 లక్షలకుపైగా ప్రభుత్వోద్యోగాల భర్తీని పూర్తి చేశామని కేటీఆర్‌ తెలిపారు.

జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.

Published date : 22 Nov 2023 11:31AM

Photo Stories