Skip to main content

Telangana Job Calendar 2024 Details : ఈ ఏడాది ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేష‌న్ల వివ‌రాలు ఇవే.. వివిధ శాఖ‌ల్లోని పోస్టులు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విడుదల చేసిన మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
Government Jobs in Telangana   telangana government jobs 2024 details in telugu   Telangana Congress: Job Calendar

దీని ప్రకారం మొత్తం 13 రకాల నోటిఫికేషన్ల‌కు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను హామీగా ప్రకటించింది.

ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జ‌న‌వ‌రి 5వ తేదీన యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మన్‌ మనోజ్‌ సోనీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని బలోపేతం చేసేందుకు సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పారదర్శకమైన నియామక ప్రక్రియ కోసం యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని పునర్ వ్యవస్థీకరించడంపై యూపీఎస్సీ చీఫ్ తో చర్చిస్తామని జ‌న‌వ‌రి 4వ తేదీన (గురువారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.

నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. గతంలో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పలు ఉద్యోగాల భర్తీలో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామన్నారు. యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీని రూపొందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తెలంగాణ‌లో 2024 సంవ‌త్స‌రం ఏఏ నెల‌లో ఏఏ నోటిఫికేష‌న్ ఇస్తారంటే..

ts government jobs 2024 news

TSPSC గ్రూప్–1, 2, 3, 4 పోస్టుల‌ నుంచి వివిధ డిపార్ట్మెంట్లలో.. వివిధ కేటగిరీలో పోస్టులను ఏ తేదీ నాడు.. నోటిఫికేషన్లు జారీ చేస్తారో స్పష్టంగా పేర్కొంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన విష‌యం తెల్సిందే. 

☛ 2024 ఫిబ్రవరి 1వ తేదీ :
TSPSC గ్రూప్– 1 నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నారు.

☛ 2024 మార్చి 01వ తేదీ :
ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుల్స్, ఇతర యూనిఫాం సిబ్బంది నియామక నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నారు.

☛ 2024 ఏప్రిల్ 01 వ తేదీ :
TSPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే JUNIOR L LECTURER, DEGREE LECTURER, POLYTECHNIC LECTURER, PHYSICAL D DIRECTOR, LIBRARIAN, ASSISTANT PROFESSOR, FOREST LECTURER, ASSISTANT REGISTRAR, ASST. LIBRARIAN ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే మొదటి దశ టీచర్ ఉద్యోగాలు SGT, SA, HEAD MASTER, KINDER GARDEN TEACHER, GURUKULA PRINCIPAL ల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

☛ 2024 మే 01వ తేదీ :
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్, హర్టీకల్చరల్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

దీంతో పాటు స్టాఫ్ నర్స్, ఇతర నర్సింగ్ ఉద్యోగాలు, హస్పిటల్ సహయకులు, పారామెడికల్ ఉద్యోగాలు, ఫిజియోథెరఫిస్ట్ లు, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.


☛  2024 జూన్ 01వ తేదీ :
TSPSC గ్రూప్ –3 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ ఇవ్వ‌నున్న‌రు. అలాగే గ్రూప్–4 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ ఇవ్వ‌నున్నారు. అలాగే AMVI, AO, TPO, AEO, Drug inspector, FSO, వెటర్నరీ సహయకులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సూపర్వైజర్,. హర్టీకల్చర్ సహయకులు, మార్కెటింగ్ సహయకులు, బాయిలర్ ఆపరేటర్ ఉద్యోగాల‌కు కూడా నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. దీంతో పాటు.. VRO, గ్రామ పంచాయతీ సెక్రటరీ లు, గ్రామ, మండల స్థాయిలో సాంకేతిక సిబ్బంది ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

☛ 2021 ఆగస్టు 1వ తేదీ :
తెలంగాణ‌లోని డాక్టర్, ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ ఇవ్వ‌నున్నారు.

☛  2024 డిసెంబర్ 1వ తేదీ :
గ్రూప్–3 రెండో దశ నోటిఫికేషన్ ఇవ్వ‌నున్నారు. అలాగే గ్రూప్–4 నోటిఫికేషన్ కూడా రెండో సారి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. రెండో దశ –AMVI, AO, TPO, AEO, Drug inspector, FSO, వెటర్నరీ సహయకులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సూపర్వైజర్,. హర్టీకల్చర్ సహయకులు, మార్కెటింగ్స స‌హయకులు, బాయిలర్ ఆపరేటర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. అలాగే ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుల్స్, ఇతర యూనిఫాం సిబ్బంది నియామక నోటిఫికేషన్ రెండో దశ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

☛  2024 డిసెంబర్ 15వ తేదీ :
TSPSC గ్రూప్–2నోటిఫికేషన్ రెండో దశ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.
అలాగే JUNIOR L LECTURER, DEGREE LECTURER, POLYTECHNIC LECTURER, PHYSICAL D DIRECTOR, LIBRARIAN, ASSISTANT PROFESSOR, FOREST LECTURER, ASSISTANT REGISTRAR, ASST. LIBRARIAN ఉద్యోగాల‌కు రెండో సారి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇంకా రెండో దశలో SGT, SA, HEAD MASTER, KINDER GARDEN TEACHER, GURUKULA PRINCIPAL ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. దీంతో పాటు.. రెండో దశలో స్టాఫ్ నర్స్, ఇతర నర్సింగ్ ఉద్యోగాలు, హస్పిటల్ సహయకులు, పారామెడికల్ ఉద్యోగాలు, ఫిజియోథెరఫిస్ట్ లు, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మొద‌టి సంవ‌త్స‌రంలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్, వివిధ బోర్డ్‌ల‌ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్ల‌డించిన విష‌యం తెల్సిందే. ఈ దిశ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు స‌న్న‌హాలు చేస్తుంది.

jobs telanganajobs telangana news telugu

 

Published date : 06 Jan 2024 07:44AM

Photo Stories