Skip to main content

Anganwadi Jobs : 14000 అంగన్వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణలో నూత‌నంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు.
Telangana Panchayat Raj Minister Sitakka reveals plans for Anganwadi recruitment  Notification soon for 14,000 Anganwadi jobs in Telangana  Anganwadi job opportunities in Telangana  telangana minister seethakka  Telangana Minister Sitakka announces 14,000 Anganwadi job openings

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు. ఏడవ తరగతి, పదో తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్లి అయిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

☛ Telangana Mega DSc Notification : త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీ.. 20000 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చేలా..

రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో..

anganwadi teacher jobs

ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్‌ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్‌ ఉంటారు. ఇక్కడ హెల్పర్‌ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్‌ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్‌ వివరాలు పంపింది. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్‌ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

వీటికి అనుగుణంగా పోస్టుల‌ను..
మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది.

☛ TS Medical Jobs : వైద్య ఆరోగ్య శాఖలో 7,356 పోస్టులు.. భర్తీ ఇంకెప్పుడు..?

Published date : 19 Dec 2023 05:57PM

Photo Stories