Junior Assistant Exam Cancelled: అభ్యర్థుల్లో ఆందోళన
ఆదినుంచి విమర్శలతో ఆరంభమైన పరీక్ష కథ కంచికి చేరింది. ప్రభుత్వ ఉద్యోగాలకు ధీ టుగా అన్ని వసతులతో వరుస లాభాలతో ముందు కు సాగుతున్న సింగరేణి ఉద్యోగాల్లో చేరేందుకు వి ద్యాధికులు పోటీ పడుతున్నారు. గ్రేడ్–2 క్లరికల్ ఉ ద్యోగాల కోసం చాలామంది పోటీ పడ్డారు. 1.02 ల క్షల మంది దరఖాస్తు చేసుకోగా 2022 సెప్టెంబర్ 4న నిర్వహించిన పరీక్షకు 77,907 మంది హాజరయ్యారు. అయితే పరీక్షలు సరిగా నిర్వహించలేదని అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కడంతో సరిగ్గా ఏడాదికి పరీక్ష రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఉద్యోగం వ స్తుందని ఎదురుచూసిన అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. దీనిపై యాజమాన్యం హైకోర్టుకు వెళ్తుందా? లేక మళ్లీ పరీక్ష నిర్వహిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చదవండి: Singareni: సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి నిధులు
సింగరేణి ఉద్యోగాలకు భారీ డిమాండ్
సింగరేణిలో ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, క్వార్టర్, మంచి వేతనా లు, ఉచిత గ్యాస్, బీమా, రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, వారస త్వ ఉద్యోగాలు ఇస్తుండటంతో ఈ సంస్థ ఉద్యోగాల వైపు విద్యాధికులు దృష్టి సారిస్తున్నారు. దీంతో తీవ్ర పోటీ నెలకొంది.
లక్షకు పైగా దరఖాస్తులు
సింగరేణి సంస్థలో 177 జూనియ ర్ అసిస్టెంట్ పోస్టుల కోసం 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో రా ష్ట్రంలోని 8 కేంద్రాల్లో 77,907 మంది పరీక్షకు హాజ రయ్యారు. ఇందులో మంచిర్యాల జిల్లాలో మంచి ర్యాల జిల్లాలో అత్యధికంగా 88శాతం మంది, ఆది లాబాద్ జిల్లాలో అత్యల్పంగా 64శాతం మంది పరీ క్ష రాశారు. పరీక్ష నిర్వహించిన తెల్లవారే కీ కూడా విడుదల చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
చదవండి: Singareni Record Profits: సింగరేణి ఆల్‌టైం రికార్డ్ లాభాలు
ఆది నుంచి ఆరోపణలే..
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం వెలువడిన నోటిఫికేషన్ నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రం లీకేజీ అయిందనే ప్రచారం జోరుగా సాగింది. వెంటనే స్పందించిన డైరెక్టర్(పా) దీనిపై టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఎక్కడైనా అక్రమాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని సంస్థ పరంగా ప్రకటన విడుదల చేశారు. అయితే పరీక్ష రాశాక ప్రశ్నాపత్రం అభ్యర్థులకు ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. సంఘటన పరిణామాలపై ఓఅభ్యర్థి హైకోర్టులో కేసు వేయడంతో పరీక్షను రద్దు చేయాలంటూ కోర్టు తీర్పునివ్వడంతో ర్యాంకర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
జిల్లా |
సెంటర్లు |
అభ్యర్థులు |
హాజరైనవారు |
శాతం |
ఖమ్మం |
23 |
12,188 |
9,915 |
81.35 |
కొత్తగూడెం |
35 |
13,385 |
12,079 |
87.31 |
కరీంనగర్ |
39 |
19,838 |
16,286 |
82.09 |
వరంగల్ |
18 |
10,899 |
9,221 |
84.60 |
మంచిర్యాల |
28 |
8,886 |
7,875 |
88.62 |
ఆదిలాబాద్ |
11 |
4,219 |
2,718 |
64.42 |
హైదరాబాద్ |
33 |
29,017 |
12,672 |
72.63 |