Singareni Record Profits: సింగరేణి ఆల్‌టైం రికార్డ్ లాభాలు
కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు.
బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్‌టైం రికార్డు అని పేర్కొన్నారు.
గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు.
☛☛ AP Education system: జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం