Skip to main content

Jobs: ఈ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఏడు టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టులు, ఏడు క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ కమిషనర్, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎంఎం నాయక్‌ జనవరి 9న ప్రకటించారు.
Jobs
జాతీయ చేనేత అభివృద్ధి పథకం విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఈ పోస్టులు బనగానపల్లె (నంద్యాల జిల్లా), మురమండ, పులగుర్త (తూర్పుగోదావరి), పాలకొండ, నారాయణపురం (పార్వతీపురం మన్యం జిల్లా), బొబ్బిలి (విజయనగరం), పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా) క్లస్టర్లలో ఉన్నాయి. క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిపొ్లమాతోపాటు రెండేళ్ల అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

చదవండి: AP Govt Jobs: సీఎస్‌పీజీ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టుకు టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సు ఉత్తీర్ణతతోపాటు చేనేత రంగంలో డిజైన్లు, ఉత్పత్తుల ప్రమోషన్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఏదైనా సంస్థ తమ డిజైనర్‌ను సిఫారసు చేసినట్లయితే ఆ అభ్యర్థి బయోడేటాతోపాటు సదరు సంస్థ లేదా ఏజెన్సీ వివరాలను సమర్పించాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 21రోజుల్లోపు మంగళగిరిలోని ఐహెచ్‌సీ భవనంలో ఉన్న చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. పూర్తి వివరాల కోసం http://www.aphandtex. gov.in వెబ్‌సైట్‌ను చూడాలి. 

చదవండి: AP Govt Jobs: కాకినాడ జిల్లాలో అకౌంటెంట్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 జీతం

Published date : 10 Jan 2023 03:43PM

Photo Stories