Skip to main content

Jobs: విమ్స్‌లో వైద్యుల పోస్టులకు ఇంటర్వ్యూలు

ఆరిలోవ: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)లో వైద్యులు పోస్టులకు సెప్టెంబ‌ర్ 21న ఇంటర్వ్యూలు నిర్వహించన్నట్లు విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు సెప్టెంబ‌ర్ 15నతెలిపారు.
VIMS Jobs
విమ్స్‌లో వైద్యుల పోస్టులకు ఇంటర్వ్యూలు

43 మంది సూపర్‌ స్పెషలిస్టులు, జనరల్‌ స్పెషలిస్టుల పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సూపర్‌ స్పెషలిస్టు వైద్యులకు నెలకు రూ 1.60లక్షలు, జనరల్‌ స్పెషలిస్టు వైద్యులకు రూ. 92 వేలు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Andhra Medical College: సీనియర్‌ వైద్యుల పోస్టుల భర్తీకి 8న ఇంటర్వ్యూలు

ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 21న ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఏపీ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలు కోసం dme.ap.nic.in అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

చదవండి: Job Notification for Steel Plant Doctors: స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ వైద్యుల కోసం నోటిఫికేషన్‌

Published date : 16 Sep 2023 04:28PM

Photo Stories