Jobs: అకడమిక్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
Sakshi Education
అనంతపురం: ఎస్కేయూలోని ఇంగ్లిష్, మేథమేటిక్స్, బోటనీ విభాగాల్లో అకడమిక్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 18న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చన్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ గానీ నెట్ (నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్), సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్)లో అర్హత పొంది ఉండాలన్నారు. రెజ్యూమ్‌తో పాటు సర్టిఫికెట్లు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు.
బోటనీ విభాగం వారికి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, ఇంగ్లిష్ విభాగంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు, మేథమేటిక్స్ విభాగంలో 4 నుంచి 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
చదవండి:
Inspiring Mother and Daughter: తల్లికి తగిన కూతురు.. అందరికీ ఆదర్శంగా వీరి ప్రయాణం
Teaching Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇదే!
Published date : 18 Oct 2023 01:24PM