Good News For AP Grama/Ward Sachivalayam Volunteer : గ్రామ/వార్డు వాలంటీర్లకు మరో గుడ్‌న్యూస్.. వీరికి రూ.30 వేల నుంచి రూ.15 వేల వరకు..!
ఇప్పుడు తాజాగా గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పంది. వైఎస్సార్ ఆసరా, చేయూత, పెన్షన్ మొదలైన పథకాల పంపిణీ విషయంలో మంచి పనితీరు కనబర్చిన వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించాలని నిర్ణయించింది.
వీటి ఆధారంగా వీరిని ఎంపిక..
ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు అందిస్తామన్నారు. నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర కింద రూ.30వేలు.. మండలానికి ఐదుగురు, మున్సిపాలిటీలో 10మంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి సేవా రత్న కింద రూ.20వేలు ఇస్తారు. సేవా మిత్ర కింద రూ.10వేలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పింఛన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.
పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో పంపాలని, వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంపికచేసి బహుమతులు అందిస్తామని సీఎం ప్రకటించారు. ‘ప్రభుత్వ పథకాలు వారి జీవితాలను ఎలా మార్చాయనేది వీడియోల్లో చూపించాలి అన్నారు. ఉత్తమమైన వాటికి సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు బహుమతిగా ఇస్తామని తెలిపారు.
☛ సేవ వజ్రా అందుకునే వారికి రూ.30,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడలు ఇవ్వడం జరుగును.
☛ సేవ రత్న అందుకునే వారికి రూ.20,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ , మెడలు ఇవ్వడం జరుగును.
☛ సేవ మిత్ర అందుకునే వారికి రూ.10,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ ఇవ్వడం జరుగును. మెడలు ఇవ్వబడదు.
తప్పనిసరిగా..
సంబంధిత జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు సంబంధిత MPDO / MC వారు ఈ సన్మాన కార్యక్రమమునకు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తారు. సచివాలయాలకు సంబంధించి నోడల్ అధికారిని ఎవరైతే జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారో వారు తప్పనిసరిగా హాజరు అవ్వవలసి ఉంటుంది. అందరూ సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు హాజరు అవ్వవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాంను సంబందించిన DLDO మరియు గ్రామ వార్డు సచివాలయ శాఖ జిల్లా ఇన్చార్జి వారు మానిటర్ చేస్తారు.
☛ AP Grama Ward Volunteer Salary Hike : ఇకపై గ్రామ, వార్డు వలంటీర్లకు వేతనం పెంపు.. ఇంకా వీళ్లకు..
ఈ అవార్డులకు పరిగనించే విషయాలు :
☛ వలంటీర్ల పనితీరు,
☛ ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి,
☛ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజరు.
☛ ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ,
వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు.
☛ తదితర అంశాల ఆధారంగా సేవా వజ్ర, సేవారత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు.
1) సేవా మిత్ర (Seva Mitra) :
అర్హతలు : 1 సంవత్సరం పూర్తిగా వాలంటీర్‌గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
నగదు : 10,000/-
2) సేవా రత్న (Seva Ratna)
ఎవరికి : మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను, మునిసిపల్ కార్పొరేషన్‌కు 10 వాలంటీర్లకు అందిస్తారు.
అర్హతలు : 1 సంవత్సరం పూర్తిగా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు. హౌస్ హోల్డ్ రీ సర్వే, పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు.
నగదు : రూ.20,000/-
3) సేవా వజ్ర (Seva Vajra) :
ఎవరికి : నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు.
అర్హతలు : 1 సంవత్సరం పూర్తిగా వాలంటీర్‌గా పని చేసి ఉండాలి.
వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు. హౌస్ హోల్డ్ రీ సర్వే, పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు.
నగదు : రూ. 30,000/-
Tags
- AP Grama/Ward Sachivalayam Volunteer Awards
- Good News For AP Grama Ward Sachivalayam Volunteers News in Telugu
- AP Grama Ward Sachivalayam Volunteers awards
- AP Grama Ward Sachivalayam Volunteer awards prize money
- Seva Vajra
- Seva Ratna
- Seva Mitra
- AP Grama Ward Sachivalayam Volunteer Salary hike news
- ap grama ward sachivalayam volunteer awards prize money details in telugu
- ap grama ward sachivalayam latest news telugu
- ap grama ward sachivalayam volunteers update 2024
- ap grama ward sachivalayam volunteers live update 2024 news
- ap grama ward sachivalayam volunteers updates 2024 news
- Sakshi Education Latest News
- GovernmentScheme
- AndhraPradeshGovernment
- FinancialSupport