Skip to main content

Anganwadi Jobs Notification Released 2024 : అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు జిల్లాల వారిగా నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లాల వారిగా నోటిఫికేష‌న్లుల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ ఉద్యోగాల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఇటీవ‌లే ఏపీలోని వివిధ జిల్లాల్లో అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
Anganwadi Jobs Notification Released 2024  Anganwadi job notifications in Andhra Pradesh Women and Child Welfare Department  ICDS Anganwadi job vacancies in Nandyal district  68 vacant Anganwadi posts under ICDS projects  Women and Child Welfare Department recruitment Andhra Pradesh Anganwadi recruitment process 2024

ఇప్పుడు తాజాగా నంద్యాల జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 68 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. బనగానపల్లి, నంద్యాల అర్బన్‌, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్‌, నందికొట్కూరు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌లు ఇవే..
వీరి ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి 21 ఏళ్ల‌ నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

➤☛ Anganwadi jobs News: అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు ఈ అర్హత ఉంటే చాలు..ఉద్యోగం మీదే..

పోస్టుల వివ‌రాలు ఇవే...
ఆరు ప్రాజెక్టుల పరిధిలో కార్యకర్తల పోస్టులు 6, మినీ కార్యకర్త 2, సహాయకుల పోస్టులు 60 ప్రకారం ఖాళీగా ఉన్నాయి. 

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
అక్టోబర్ 10వ తేదీ నుంచి ఎక్కడికక్కడ సీడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. అక్టోబరు 21వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. రిజర్వేషన్‌ రోస్టర్, ఇతరాత్ర సమగ్ర వివరాల కోసం ఆన్‌లైన్‌ లేదా సంబంధిత ప్రాజెక్టు కార్యాలయం నోటీసు బోర్డులో చూసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.

 Anganwadi Jobs Notification 2024 Released : ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. 10, 7వ త‌ర‌గ‌తి అర్హతతోనే.. అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల..

Published date : 11 Oct 2024 11:26AM

Photo Stories