Skip to main content

Anganwadi Jobs Notification 2024 Released : ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. 10, 7వ త‌ర‌గ‌తి అర్హతతోనే.. అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని జిల్లాల వారిగా అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేస్తున్నారు.

తాజాగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్.., అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

అర్హ‌త‌లు ఇవే..
ఆసక్తికలిగిన మహిళా అభ్యర్ధులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టులకు 10వ తరగతి, 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం ఇలా..
ఈ ఉద్యోగాల‌ను విద్యార్హతలు, రిజర్వేషన్‌ రోస్టర్, స్థానికత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. 

జీతం :
ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి నెలకు అంగన్‌వాడీ వర్కర్లకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు రూ.7000 చొప్పున జీతం చెల్లిస్తారు. 

☛➤ TSPSC AEE Topper Success Story : ప‌ట్టు ప‌ట్టానిలా.... AEE ఉద్యోగం కొట్టానిలా... నేను ఫెయిల్యూర్ అయిన ప్ర‌తిసారి...

ద‌ర‌ఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాల‌కు ఆఫ్‌లైన్‌ విధానంలో మాత్రమే దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివ‌రాలు ఇవే..
అనంతపురం అర్బన్‌లో 8, శింగనమలలో 6, నార్పలలో 9, అనంత గ్రామీణంలో 10, తాడిపత్రి 14, గుత్తి 5, ఉరవకొండ 12, కళ్యాణదుర్గం 6, కణేకల్లు 5, కంబదూరు 7, రాయదుర్గంలో 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా గ్రామాల పరిధిలో ఎక్కడికక్కడ సీడీపీఓలు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులకు 1 అక్టోబరు, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 84 పోస్టులను భర్తీ చేస్తారు.

Published date : 26 Sep 2024 02:59PM

Photo Stories