Skip to main content

AP VRO & VRA Jobs : వీఆర్‌ఏ, వీఆర్వోల‌కు శుభ‌వార్త‌.. ఈ అర్హతలు ఉన్న వారికి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరినట్లు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సంఘం ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
AP VRO and VRA Jobs News Telugu
AP CM YS Jagan Mohan Reddy

అనంతరం మీడియా పాయింట్‌ వద్ద రవీంద్రరాజు మాట్లాడారు. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉందని, దీంలో చాలా మంది వీఆర్వోలకు సీనియర్‌ సహాయకుల పోస్టులు రావడం లేదన్నారు. వీఆర్వోల పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో ఎవరైనా వీఆర్వో చనిపోతే అతని కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కోరామన్నారు.

☛ AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

1,500 మందికి..
రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏ నుంచి వీఆర్వోకు అర్హత కల్గిన 1,500 మందికి అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, ఏపీ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వీఎస్‌ దివాకర్, సీఆర్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

☛ Andhra Pradesh : కొత్తగా నియమితులైన 1,543 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు.. ఇంకా..

Published date : 19 Jul 2023 03:04PM

Photo Stories