TSROADS: కొత్తగా 472 పోస్టులు మంజూరు
పోస్టులసంఖ్య పెంచటం, ఉన్న అధికారులు, సిబ్బందిని జిల్లాలవారీగా పంచటం, వారికి ఉన్న ఆర్థికపరమైన కేటాయింపు బాధ్యతల పంపిణీ తదితరాలకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖలోని వివిధ విభాగాల్లో 472 పోస్టులను మంజూరు చేసింది. గత నవంబర్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయిలో సమీక్షించి దీనిపై ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను మరింత మెరుగ్గా నిర్వహించటంతోపాటు వర్షాల వల్ల దెబ్బతిన్న వాటిని వీలైనంత తొందరగా మరమ్మతు చేసి పునరుద్ధరించాలంటే అధికారులు, సిబ్బంది వ్యవస్థను సమూలంగా మార్చా ల్సి ఉందని అప్పట్లో అభిప్రాయపడ్డారు.
చదవండి: UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 146 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఈ మేరకు కొత్తగా సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల ఏర్పాటుతోపాటు వాటికి కొత్తగా అధికారుల వ్యవస్థను రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కసరత్తు చేసి నివేదికలు పంపాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేసి కొన్ని కొత్త పోస్టులతోపాటు సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల సంఖ్యను ఖరారు చేశారు. దానిని ఆర్థిక శాఖ ఆమోదించటంతో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు తాజాగా ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో ఆదేశించారు.
సర్కిళ్ల సంఖ్య 25కు పెంపు:
రోడ్లు, భవనాల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 సర్కిళ్ల సంఖ్యను 25కు పెంచారు. డివిజన్ల సంఖ్యను 49 నుంచి 62కు, సబ్ డివిజన్లను 135 నుంచి 214కు పెంచారు. సెక్షన్ల సంఖ్యను 432 నుంచి 556కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తం విభాగాలను ప్రక్షాళన చేసి కొత్తగా రీఆర్గనైజ్ చేశారు. ఆ మేరకు పోస్టులను ఆయా విభాగాలు, జిల్లాలవారీగా కేటాయిస్తూ వివరాలను ఉత్త ర్వుల్లో పొందుపరిచారు. చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, చీఫ్ ఇంజనీర్ టెరిటోరియల్ 1, 2 లాంటి కొత్త అధికారుల అంచెను ఏర్పాటుచేసి వాటి కింద అధికారులు, సిబ్బంది వ్యవస్థను సిద్ధం చేసి పోస్టులు కేటాయించారు.
చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు