Skip to main content

టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ విడుదల

ప్రభుత్వ పాఠశాల టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Teacher promotion schedule release
టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ విడుదల

ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్స్, గ్రేడ్‌–2 హెడ్‌మాస్టర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ విడుదల చేశారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌ ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఆక్టోబర్‌ 7వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచుతారు. వీటిపై ఉన్న అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఆక్టోబర్‌ 8వ తేదీలోగా తెలపాల్సి ఉంటుంది. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఆక్టోబర్‌ 9వ తేదీన పరిశీలించి తుది సీనియారిటీ జాబితాను 10న విడుదల చేస్తారు. గ్రేడ్‌–2 పోస్టుల ప్రమోషన్లను ఆక్టోబర్‌ 11న, స్కూల్‌ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల పదోన్నతులను ఆక్టోబర్‌ 12, 13 తేదీల్లో విడుదల చేస్తారు. 

చదవండి: 

AP Government Jobs : ఏపీ విద్యాశాఖలో 679 పోస్టులు మంజూరు.. కీల‌క‌ ఉత్తర్వులు జారీ

Army Public School Recruitment: 136 టీచర్‌ పోస్ట్‌లు.. అర్హతలు, ఎంపిక విధానం ఇలా..

Published date : 04 Oct 2022 04:52PM

Photo Stories