Study Material: నిరుద్యోగులకు ఉచితంగా స్టడీ మెటీరియల్
ఇందులో భాగంగా సెప్టెంబర్ 15న దాదాపు రూ.35 లక్షల విలువైన స్టడీమెటీరియల్‌ను అర్హులకు అందించామన్నారు. నిరుద్యోగ దివ్యాంగులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగులు బాగా చదివి ఉన్నతమైన కొలువులు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఇచ్చే కోచింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1,300 దరఖాస్తులు వచ్చాయని, అందులో 700 మందికి బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లలో అవకాశం కల్పించి ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని హాస్టళ్లలో ఉంటున్న మరో 300 మందికి రూ.55 లక్షలు ఖర్చు చేసి, ప్రత్యేక కోచింగ్ సెంటర్ల ద్వారా శిక్షణతోపాటు, స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించామని తెలిపారు.
చదవండి:
☛ టీఎస్‌పీఎస్సీ ☛ స్టడీ మెటీరియల్ ☛ బిట్ బ్యాంక్ ☛ గైడెన్స్ ☛ సిలబస్ ☛ ప్రివియస్ పేపర్స్ ☛ ఎఫ్‌ఏక్యూస్ ☛ ఆన్‌లైన్ క్లాస్ ☛ ఆన్‌లైన్ టెస్ట్స్