MLHP: నియామక ప్రక్రియపై స్టే
ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజుల ధర్మాసనం అక్టోబర్ 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
డాక్టర్ వైఎస్సార్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్స్–ఆరోగ్య వెల్‌నెస్ కేంద్రాల్లో 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ నియామకం కోసం ఆగస్టులో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కొందరు వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎంఎల్‌హెచ్‌పీ నియామక ప్రక్రియను కొనసాగించుకునేందుకు ప్రభుత్వానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ వైద్యులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.
చదవండి: NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు