Skip to main content

NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు

MBBS విద్యార్థులు ఇక ముందు ఫ్యామిలీ డాక్టర్లుగా మారిపోనున్నారు.
NMC
గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు

నేరుగా గ్రామాల్లోని ప్రజల వద్దకే వెళ్లి.. కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకోసారి ఇంటికే వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్‌ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటివి చేయనున్నారు. ఎంబీబీఎస్‌ సిలబస్‌లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫార్సులను National Medical Commission (NMC) తాజాగా అమల్లోకి తెచి్చంది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్‌లో కుటుంబాల దత్తతను ప్రధాన అంశంగా ప్రస్తావించింది. 

చదవండి: మెడికల్‌ పోస్టుల భర్తీ నుంచి ‘ట్యూటర్‌’ తొలగింపు

ఇంటి ముంగిటికే వైద్యం 

ప్రస్తుతం చాలావరకు గ్రామాల్లో గుర్తింపు లేని ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లు, ఆర్‌ఎంపీల వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. కొందరు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండటం, నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రాణాల మీదకు వ చ్చిన ఘటనలూ ఎన్నో. అర్హత లేని ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, డెలివరీలు వంటివి కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్‌ లభించేందుకు.. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎన్‌ఎంసీ గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా దీనిని అమల్లోకి తెచి్చంది. దీనితో పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

చదవండి: విరితో పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు

ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో గ్రామం 

ఎన్‌ఎంసీ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలలకు చెందిన ఒక్కో బ్యాచ్‌ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యారి్థకి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్‌ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆస్పత్రికి రిఫర్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాలి. కోర్సు మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటినీ కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. ఇలా విద్యార్థులు ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం నుంచే ఫ్యామిలీ డాక్టర్ల అవతారం ఎత్తుతారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచి్చపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమకూరుతుందని చెప్తున్నారు. 

చదవండి: Internship: ఎంబీబీఎస్‌ చదివిన చోటే ఇంటర్న్‌షిప్‌

వేల మంది విద్యార్థులు.. లక్షన్నరకుపైగా కుటుంబాలు.. 

ఈ ఏడాది మొదలవుతున్న కొత్త కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 18 ప్రభుత్వ, 24 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాచ్‌లకు చెందినవారు కలిపి దాదాపు 20 వేల మందికిపైగా ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఉంటారు. ఆయుష్, డెంటల్‌ వారినీ కలిపితే మరో ఐదారు వేల మంది జత అవుతారు. ఇంతమందికి కుటుంబాల దత్తత బాధ్యత ఇస్తే.. లక్షన్నరకు పైగా కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ ఉన్నందున అన్ని చోట్లా ఫ్యామిలీ డాక్టర్‌ పద్ధతి అమల్లోకి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 

చదవండి: ఎంబీబీఎస్‌ తర్వాత నెక్ట్స్‌ పాసైతేనే రిజిస్ట్రేషన్‌

విద్యార్థులు చేసేదిదీ..

వైద్య విద్యార్థులు గ్రామాల్లో తాము దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు నెలకు రెండు సార్లు వస్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. 
వ్యక్తుల వారీగా ఆరోగ్య రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. 
అవసరాన్ని బట్టి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గుండె పనితీరు పరీక్షలు, కేన్సర్‌ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. పరిశీలించి తగిన వైద్య సలహాలు ఇస్తారు. మందులు సూచిస్తారు. అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు. 
పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్‌చెకప్‌లపై అవగాహన కల్పిస్తారు. 
రోగాలు రాకుండా ఎలాంటి ఆహార అలవాట్లు అలవరుచుకోవాలో సూచిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. 
గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచుగా వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. 
ఈ అన్ని అంశాల్లో తమకు పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు. 

చదవండి: MBBS Education: పల్లె నాడి పట్టే మెడికో

పల్లెల్లో వైద్య సేవలు మెరుగుపడతాయి 
గ్రామాల్లో కుటుంబాలను వైద్య విద్యార్థులు దత్తత తీసుకోవడం వల్ల మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జాతీ య వైద్య కమిషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్‌ ఉండటం వల్ల కుటుంబా లు తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు ధైర్యంగా చెప్పేందుకు, వైద్య పరీక్షలు చేయించుకుని సరైన వైద్యం పొందేందుకు వీలు కలుగుతుంది. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కచి్చతంగా అమలు చేస్తే బాగుంటుంది. 
– డాక్టర్‌ కార్తీక్‌ నాగుల, జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 
జబ్బులకు మూలం తెలుస్తుంది 
గ్రామాల్లో కుటుంబాలను వైద్య విద్యార్థులు దత్తత తీసుకోవడం వల్ల జబ్బులకు మూల కారణం ఏమి టో తెలుస్తుంది. కుటుంబాన్ని సమగ్రంగా పరిశీలించడం వల్ల అనేక ఆరోగ్య విషయాలు బయటపడతాయి. ఇది వైద్య విద్యార్థులకు ఈ అనుభవం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటివరకు జబ్బు వస్తే మందులు రాయడానికే పరిమితం అయ్యేవారు. కొత్త విధానం వల్ల గ్రామాల్లో జబ్బులకు మూలం తెలుసుకోవడానికి, దానిపై పరిశోధన చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గ్రామాల్లో ప్రాక్టీస్‌ చేయాలన్న ఆలోచన కూడా వైద్య విద్యార్థుల్లో ఏర్పడుతుంది. మరోవైపు ఆయా గ్రామీణ కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, అసోసియేట్‌ ప్రొఫెసర్, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 

Published date : 14 Oct 2022 01:13PM

Photo Stories