మెడికల్ పోస్టుల భర్తీ నుంచి ‘ట్యూటర్’ తొలగింపు
ఈ మేరకు సర్క్యులర్ జారీచేసింది. మెడికల్ కాలేజీల్లో వివిధ విభాగాలకు చెందిన ట్యూటర్ పోస్టులకు MBBS అర్హత అవసరం లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉంటే చాలని National Medical Commission (NMC) మార్గదర్శకాలు జారీ చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వైద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టుల భర్తీకి జూన్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1,326 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. అందులో వైద్య విద్యా సంచాలకుని పరిధిలో 357 ట్యూటర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. వీరికి రూ. 57,700 నుంచి రూ.1,82,400 (UGC) స్కేల్ ఖరారు చేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు ట్యూటర్ పోస్టులను జాబితానుంచి తొలగించింది. రిక్రూట్‌మెంట్ బోర్డు వాటిని ఎమ్మెస్సీ అభ్యర్థులతో కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ట్యూటర్ పోస్టులకు కాకుండా మిగిలిన 969 పోస్టులకు అగష్టు 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
చదవండి: