Medical and Health Department: సీఏఎస్ పోస్టుల భర్తీకి రెండో జాబితా విడుదల.. జాబితా కోసం క్లిక్ చెయండి
Sakshi Education
Medical and Health Departmentలో Civil Assistant Surgeon(CAS) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రెండో విడత ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 13న విడుదల చేశారు.
సీఏఎస్ పోస్టుల భర్తీకి రెండో జాబితా విడుదల
డీహెచ్, ఏపీవీవీపీ, డీఎంఈలో 846 సీఏఎస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి ఎంపికైన వారితో తొలి జాబితాను అధికారులు గత వారంలో విడుదల చేసి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
అయితే, 586 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరిలో కొందరు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ విధుల్లో చేరలేదు. ఈ క్రమంలో మిగిలిన పోస్టుల భర్తీ కోసం 210 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేశారు. వీరికి అక్టోబర్ 15న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి తెలిపారు.