KCR: కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే వారికి ఈ అవకాశం..
స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. డిసెంబర్ 18న్ ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలు చర్చించారు.
వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే ఒకే చోట విధులు నిర్వర్తిస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని సీఎం పేర్కొన్నారు. వారుఒకే చోట విధులు నిర్వహించే అవకాశం కలిపించనున్నారు.
చదవండి:
Police Department: జిల్లా కేడర్ పోస్టుగా కానిస్టేబుల్
Teachers: మా మొర వినే ఆప్షనే లేదా?
Zonal System: పాత జిల్లాల ఉద్యోగులకు ఏయే కొత్త జిల్లాల్లో అర్హతో తెలుసుకోండి ఇలా..