Zonal System: పాత జిల్లాల ఉద్యోగులకు ఏయే కొత్త జిల్లాల్లో అర్హతో తెలుసుకోండి ఇలా..
నిర్దేశిత నమూనాలో తమ ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొంటూ.. సంబంధిశాఖ జిల్లాధిపతి (జిల్లా కేడర్), విభాగాధిపతి (జోనల్), శాఖ కార్యదర్శి (మల్టీ జోనల్)కు దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ఉద్యోగులెవరైనా దరఖాస్తు చేసుకోకుంటే.. సంబంధిత అధికారులే నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తారని స్పష్టం చేసింది. ఎక్కడైనా పోస్టుల లభ్యతకు మించి ప్రాథమ్యాలు ఉంటే.. ఉద్యోగుల సీనియా రిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం.. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగుల కేడర్లను 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా పునరి్వభజిస్తూ ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్–2018’ను రాష్ట్రపతి జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోనల్ కేడర్లకు పోస్టుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్) విభజన ఇప్పటికే పూర్తయింది. వాటికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ప్రాథమ్యాలను పరిశీలించి కేటాయింపులు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
- పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లా/జోనల్/మల్లీ జోనల్ పోస్టుల సంఖ్యను విభజించారు. అదే నిష్పత్తిలో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతి లోకల్ కేడర్‌కు వర్కింగ్ స్ట్రెంత్‌ను కేటాయించాయి.
- పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల జాబితాలను శాఖల అధిపతులు రూపొందిస్తారు. కేటాయింపుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సెలవులు, సస్పెన్షన్, శిక్షణ, డిప్యుటేషన్, ఫారిన్ సరీ్వస్‌లో ఉన్న ఉద్యోగులను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. కేటాయింపుల అనంతరం వారు కొత్త లోకల్ కేడర్లలో సెలవులు, సస్పెన్షన్, డిప్యుటేషన్, శిక్షణ, ఫారిన్ సరీ్వస్‌లో కొనసాగుతున్నట్టు పరిగణిస్తారు.
జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ఇలా..
- ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో అన్నిపోస్టులకు.. సదరు ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులందరినీ పరిగణనలోకి తీసుకుంటారు.
- హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి కొత్త జిల్లాలు ఒకటి కంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రాంతాల కలయికతో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి పాత జిల్లాల ఉద్యోగులకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలతోపాటు, ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతం కలిసిన కొత్త జిల్లాల్లోనూ అవకాశం కల్పిస్తారు.
జోనల్ కేడర్ కేటాయింపులు ఇలా..
- కొత్త జోనల్/మల్టీజోనల్ కేడర్లకు ఖరారైన ఉద్యోగుల సంఖ్యకు లోబడి.. పాత జోనల్ కేడర్‌లోని ఉద్యోగులందరినీ కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
- పాత 5వ జోన్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 1–4 జోన్లకు (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులు మినహాయించి), జోన్ –5లోని జనగామ జిల్లాలో ఉన్న పోస్టుల్లో కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
- పాత జోన్ –6 కేడర్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 5, 6, 7 జోన్లకు (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి), జోన్ –2లోని నిజామాబాద్ జిల్లాకు, జోన్ –3లోని కామారెడ్డి, మెదక్ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు.
మల్టీ జోన్ పోస్టులు ఇలా...
- పాత 5వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్ –1 (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రాంతం మినహాయించి)కు, మలీ్టజోన్ –2లోని జనగామ జిల్లాలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు.
- పాత 6వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్ –2 (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి)కు, మల్టీ జోన్ –1లోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు.
- రాష్ట్రపతి పాత ఉత్తర్వులు వర్తించని కొన్ని పోస్టులను కొత్త ఉత్తర్వుల్లో మల్టీజోనల్ పోస్టులుగా విభజించారు. అలాంటి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులు, పాత మలీ్టజోన్ కేడర్ ఉద్యోగులను ఏదైనా ఒక కొత్త మలీ్టజోన్ కు కేటాయిస్తారు.
కొన్ని ప్రత్యేక కేటగిరీలుగా..
కొన్ని ప్రత్యేక అంశాల మేరకు సీనియారిటీతో సంబంధం లేకుండా కొత్త లోకల్ కేడర్లకు కేటాయింపులు చేస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీల కింద కేటాయింపు పొందడానికి ఉద్యోగులు తగిన రుజువులు సమరి్పంచాల్సి ఉంటుంది.
- 70శాతం, ఆపై వైకల్యంగల వారు, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వితంతువులు ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తారు.
- మనోవైకల్యంగల పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట పోస్టింగ్ ఇస్తారు.
- కేన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ/కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వారిని.. ఇదే క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు.
విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు
- ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలి్పస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్‌లో వారికి స్థానం కలి్పస్తారు.
- కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది.
ఎవరెవరికి ఏ జిల్లాల్లో..
పాత జిల్లాల ఉద్యోగులకు ఏయే కొత్త జిల్లాల్లో అర్హత?
ఉమ్మడి జిల్లా |
ఏ కొత్త జిల్లాల్లో అర్హత |
ఆదిలాబాద్ |
ఆదిలాబాద్, కొమురంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ |
హైదరాబాద్ |
హైదరాబాద్ |
కరీంనగర్ |
హన్మకొండ (పార్టు), జగిత్యాల, జయశంకర్–భూపాల్‌పల్లి (పార్టు), కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట (పార్టు) |
ఖమ్మం |
భద్రాద్రి–కొత్తగూడెం,ఖమ్మం, మహబూబాబాద్(పార్టు), ములుగు (పార్టు) |
మహబూబ్‌నగర్ |
జోగులాంబ–గద్వాల, మహబూబ్‌నగర్ (పార్టు), నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి (పార్టు), వికారాబాద్ (పార్టు), వనపర్తి |
మెదక్ |
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట (పార్టు) |
నల్లగొండ |
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి–భువనగిరి |
నిజామాబాద్ |
కామారెడ్డి, నిజామాబాద్ |
రంగారెడ్డి |
మహబూబ్‌నగర్ (పార్టు), మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి (పార్టు), వికారాబాద్ (పార్టు) |
వరంగల్ |
హన్మకొండ (పార్టు), జనగాం, జయశంకర్ భూపాల్‌పల్లి (పార్టు), మహబూబాబాద్ (పార్టు), ములుగు (పార్టు), సిద్దిపేట (పార్టు), వరంగల్ |
పాత జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులకు ఏయే కొత్త జోన్లు, మల్టీజోన్లలో అర్హత?
పాత జోన్ |
కొత్త మల్టీజోన్ |
కొత్త జోన్ |
కొత్త జిల్లాలు |
(జోన్ –5) |
మల్టీజోన్ –1 |
జోన్ –1 |
కొమురంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు |
జోన్ –2 |
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల |
||
జోన్ –3 |
కరీంనగర్, రాజన్న–సిరిసిల్ల, సిద్దిపేట (పూర్వపు వరంగల్–కరీంనగర్ జిల్లాలు) |
||
జోన్ –4 |
భద్రాద్రి– కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్,హన్మకొండ |
||
మల్టీజోన్ –2 |
జోన్ –5– |
జనగాం |
|
(జోన్ –4) |
మల్టీజోన్ –1 |
జోన్ –2 |
నిజామాబాద్ |
జోన్ –3 |
సిద్దిపేట (పూర్వపు మెదక్ జిల్లా), మెదక్, కామారెడ్డి |
||
మల్టీజోన్ –2 |
జోన్ –5 |
సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి– భువనగిరి |
|
జోన్ –6 |
మేడ్చల్– మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ |
||
జోన్ –7 |
మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి |
చదవండి:
Dr Kakumanu Raja Sikhamani: రెస్ట్ తీసుకునే వయసులో ఎవరెస్ట్‌పై