Skip to main content

TS Government Jobs Updates 2024 : నిరుద్యోగులు ఆందోళన పడొద్దు.. జాబ్‌ కేలండర్ ఇస్తాం.. అలాగే మ‌రో 6000 టీచ‌ర్ పోస్టుల‌కు కూడా నోటిఫికేష‌న్‌ ఇస్తాం ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో 5000 నుంచి 6000 టీచ‌ర్ ఉద్యోగాల‌కు మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని.. అలాగే జాబ్‌ కేలండర్ కూడా విడుద‌ల చేస్తామ‌ని.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర­మార్క తెలిపారు.
bhatti vikramarka telangana deputy cm  Telangana to announce 5,000 to 6,000 teacher jobs  Job calendar announcement by Telangana government  Deputy Chief Minister Mallu Bhatti Vikramarka informs about upcoming DSC notification

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపా­ధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని..  దీన్ని దృష్టిలో పెట్టు­కు­ని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర­మార్క సూచించారు.  ప్రస్తుతం 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ వేస్తామని ప్రకటించారు.

30వేల మందికి ఉద్యోగాల‌ను..
 జూలై 14వ తేదీన (ఆదివారం) గాందీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..   గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్‌ఎస్‌ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్‌ కేలండర్‌ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన‌ మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, డివిజనల్‌ అకౌంట్‌ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్‌ లెక్చరర్లు, మెడికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. 

డీఎస్సీ-2024 షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు ..
భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్‌ ఉందని.. ఆ షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్‌ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గత ప్రభుత్వం గ్రూప్‌–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చిందని.. ఆ పేపర్‌ లీక్‌ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్‌ చేశామని.. ప్రిలిమ్స్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్‌–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు. గత సర్కారు గ్రూప్‌–3 కోసం డిసెంబర్‌ 30, 2022న నోటిఫికేషన్‌ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు.

Published date : 15 Jul 2024 01:50PM

Photo Stories