Skip to main content

TS Fee Reimbursement 2024 Update : ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఏమ‌న్నారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : వైఎస్సార్ ఆనాడు ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని.. ఉన్న‌త స్థానంలో ఉండాల‌ని.. ఒక గొప్ప ఆశ‌యంతో.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప‌థ‌కంను తీసుకొచ్చారని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
Education reform announcement by Telangana CM.  Telangana CM Revanth Reddy  YSR announces fee reimbursement scheme  Fee reimbursement initiative for students

జూలై 13వ తేదీన (శనివారం) జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారు. 

ఆన్‌టైమ్‌లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తాం..
రకరకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం. ఈ అకడమిక్  ఇయర్ నుంచి ఆన్‌టైమ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. 

ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు..
దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి. అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి.

➤☛ Two Lac Government Jobs 2024 Details in TS : 2 లక్షల ఉద్యోగాలను వెంట‌నే భర్తీ చేయాల్సిందే.. గ్రూప్‌-1లో 1,600, గ్రూప్‌-2లో 2,200, గ్రూప్‌-3లో 3000 పోస్టుల‌ను..

నిరుద్యోగులకు మేలు జరిగేలా..
ఇంజనీరింగ్‌లో కేవలం కంప్యూటర్ సైన్స్‌పైనే కాదు.. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. 

➤☛ TSPSC Group 2 New Exam Dates News 2024 : గ్రూప్–2,3 కొత్త ప‌రీక్ష తేదీల‌పై టీఎస్‌పీఎస్సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను..
నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను తీసుకురాబోతున్నాం. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా.. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published date : 15 Jul 2024 10:24AM

Photo Stories