Skip to main content

Govt Employees : తెలంగాణ స‌ర్కార్ వినూత్న నిర్ణ‌యం.. ఇక‌నుంచి 10వేలు పెంచాలి..

ప్ర‌భుత్వ ఉద్యోగుల కుటుంబానికి స‌ర్కార్ ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది..
Innovative decision of telangana government to increase 10 thousand  Telangana CM Revanth Reddy making an announcement  Telangana government raises funeral assistance to Rs 30,000

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువడింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తీ ప్ర‌భుత్వ ఉద్యోగికి త‌న మ‌ర‌ణం అనంత‌రం, ఇచ్చే అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చును పెంచిన‌ట్లు తెలిపింది స‌ర్కార్‌. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఇస్తూ వ‌చ్చ‌న 20వేల రూపాయ‌ల‌ను కాస్త‌, 10వేల‌కు పెంచి ఇక‌నుంచి 30,000 చేసింది. ఇప్ప‌టినుంచి ప్ర‌భుత్వ ఉద్యోగి మ‌ర‌ణం త‌రువాత చేసే అంత్య‌క్రియ‌ల‌కు ప్ర‌భుత్వం త‌మ కుటుంబానికి 30వేలు అంద‌జేస్తుంది.

Leaves Rules : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సెల‌వు కావాలంటే.. ఈ నిబంధ‌న‌లు పాటించాల్సిందే..! లేక‌పోతే..

ఉద్యోగి కుటుంబానికి భ‌రోసాగా..

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారం చేపట్టిన త‌రువాత నుంచి అనేక ప‌థ‌కాలు, వినూత్న నిర్ణ‌యాలు వెలువ‌డుతున్నాయి. అయితే, ఇక్క‌డ ప్ర‌భుత్వం విశ్రాంత ఉద్యోగి కుటుంబాల‌కు కూడా త‌మ భ‌రోసాను చూపుతున్నారు. ఇందులోని భాగమే ఈ ఆర్థిక సాయం. ఉద్యోగి మ‌ర‌ణాంత‌రం వారి కుటుంబానికి, ఉద్యోగి అంత్య‌క్రియ‌ల‌కు గాను ప్ర‌భుత్వం నుంచి 30 వేలు వ‌స్తాయి. మొద‌టి వేతన స‌వ‌ర‌ణ క‌మిష‌న్ సిఫార్సుల మెర‌కు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 05 Dec 2024 10:42AM

Photo Stories