డిజిటల్ అసిస్టెంట్లకు గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతికి వీలు!
రాబోయే రోజుల్లో గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల్లో ఏర్పడే ఖాళీల్లో ప్రతి 10 ఉద్యోగాల్లో నాలుగింటిని నేరుగా నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేశారు. మిగిలిన ఆరింటిలో 5 పోస్టులను డిజిటల్ అసిస్టెంట్‌లకు పదోన్నతులు కలి్పంచడం ద్వారా, మరోక పోస్టును గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు పదోన్నతులు కలి్పంచడం ద్వారా భర్తీ చేస్తారు.
చదవండి: AP High Court Jobs: ఏపీ హైకోర్టులో 39 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఇందుకు ప్రత్యేకంగా రోస్టర్‌లుగా నిర్థారిస్తూ పంచాయతీ కార్యదర్శుల సర్విస్ రూల్స్‌లో మార్పులు చేయనున్నారు. కొత్త రోస్టర్ ప్రకారం..గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ ఖాళీ భర్తీ ప్రక్రియలో ప్రతి 10 పోస్టులలో మొదటిది, 4,5,7, పదవ పోస్టులను డిజిటల్ అసిస్టెంట్‌లకు పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు. ప్రతి పది పోస్టులలో 2, 3, 8, 9 పోస్టులను నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. ప్రతి పదింటిలో ఆరవ వరస నంబర్ పోస్టును గ్రామ పంచాయతీలో పనిచేసే ఇతర ఉద్యోగులకు పదోన్నతి కలి్పస్తారు.
చదవండి: AP Govt Jobs: సీఎస్‌పీజీ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..