Skip to main content

502 Jobs: టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. పోస్టుల వివరాలు ఇలా..

రాష్ట్రంలో వివిధ యాజమాన్య పాఠశాలల్లో 502 టీచర్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 22 రాత్రి నోటిఫికేషన్లు జారీ చేసింది.
502 Jobs
టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. పోస్టుల వివరాలు ఇలా..

టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) ద్వారా వీటిని భర్తీ చేయనుంది. గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చింది. జిల్లా పరిషత్‌ (జెడ్పీ), మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207, మున్సిపల్‌ స్కూళ్లలో 15, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆం«ధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు https://cse.ap.gov.in/DSE ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

చదవండి: Best Teacher Awards: దరఖాస్తుల ఆహ్వానం

కంప్యూటరాధారితంగా పరీక్షలు 

ఈ టీచర్‌ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటరాధారితంగా జరుగుతాయి. ఇందులో మెరిట్, రిజర్వేషన్లు, ఇతర నిబంధనల ప్రకారం ఆయా పోస్టులను భర్తీ చేస్తారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో సెకండరీ గ్రేడ్‌ టీచర్, స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజెస్‌), స్కూల్‌ అసిస్టెంట్‌ (నాన్‌ లాంగ్వేజెస్‌), టీజీటీ (లాంగ్వేజెస్‌), టీజీటీ (నాన్‌ లాంగ్వేజెస్‌), టీజీటీ (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ), పీజీటీ (లాంగ్వేజెస్‌), పీజీటీ (నాన్‌ లాంగ్వేజెస్‌), పీజీటీ (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌), మ్యూజిక్, ఆర్ట్స్‌ విభాగాల వారీగా ఈ పరీక్షలుంటాయి. 

చదవండి: దేశ రాజధానిలో 547 టీచింగ్‌ కొలువులు.. ప్రిపరేషన్‌ ఇలా

డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ 

టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను అనుసరించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనరల్‌ మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. 

చదవండి: ‘డీఎస్సీ క్వాలిఫైడ్‌’ జాబితా ఇదే.. చూడండి

షెడ్యూల్‌ ఇలా.. 

నోటిఫికేషన్‌ విడుదల

ఆగస్టు 22

పేమెంట్‌గేట్‌వే ద్వారా

ఆగస్టు 24 నుంచి

ఫీజు చెల్లింపు

సెప్టెంబర్‌ 17 వరకు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు

హెల్ప్‌ డెస్కుల అందుబాటు

ఆగస్టు 22 నుంచి

మాక్‌ టెస్టు అందుబాటు

అక్టోబర్‌ 17 నుంచి 

హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌

అక్టోబర్‌ 6 నుంచి

పరీక్ష తేదీలు

అక్టోబర్‌ 23 నుంచి

ప్రాథమిక కీ విడుదల

అక్టోబర్‌ 28

అభ్యంతరాల స్వీకరణ

అక్టోబర్‌ 28 నుంచి 31 వరకు

తుది కీ విడుదల

నవంబర్‌ 2

తుది ఫలితాలు విడుదల

నవంబర్‌ 4

వివిధ పోస్టుల వివరాలు ఇలా..

జిల్లా

ప్రభుత్వ/ జెడ్పీ/ ఎంపీపీ

మున్సిపల్‌

స్పెషల్‌ టీచర్లు (ఎస్‌ఏ)

శ్రీకాకుళం

61

2

4

విజయనగరం

6

0

7

విశాఖపట్నం

13

0

6

తూ.గోదావరి

8

0

6

ప. గోదావరి

16

2

6

కృష్ణా

2

2

7

గుంటూరు

3

1

6

ప్రకాశం

4

0

6

నెల్లూరు

0

0

9

చిత్తూరు

27

0

5

వైఎస్సార్‌

11

4

7

అనంతపురం

13

3

10

కర్నూలు

35

1

2

మొత్తం

199

15

81

Published date : 24 Aug 2022 04:30PM

Photo Stories