Jobs: బ్రేకింగ్: వెద్య అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు..ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్..
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రానున్న 8 ప్రభుత్వ వైద్య కాలేజీలకు అవసరమైన దాదాపు 430 వైద్య అధ్యాపక పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు చేపట్టింది.
ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కొత్త కాలేజీలకు తాత్కాలిక భవనాల నిర్మాణం, అధ్యాపక పోస్టుల భర్తీ పూర్తి చేస్తేనే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ ఎంసీ) ఆ మేరకు కాలేజీలకు పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వనుంది. అనుమతులు లభించాక వచ్చే ఏడాది నీట్ ప్రవేశపరీక్షకు ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల లిస్టులో ఈ ఎనిమిది కాలేజీలను చేరుస్తారని, అనంతరం 2022 నుంచి ఈ కాలేజీల్లో మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
చదవండి:
Medical Colleges: 4 కొత్త మెడికల్ కాలేజీలు
PG Medical Seats: పీజీ వైద్య సీట్ల పెంపు
VIMS: విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
Published date : 18 Sep 2021 01:59PM