Skip to main content

PG Medical Seats: పీజీ వైద్య సీట్ల పెంపు

స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిధిలోని వైద్య కాలేజీల్లో భారీగా పీజీ వైద్య సీట్లు పెంచుకునే అవకాశం కలిగింది.
PG Medical Seats
పీజీ వైద్య సీట్ల పెంపు

ప్రస్తుతం ఉన్న సీట్లకు దాదాపు రెట్టింపు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల భవిష్యత్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు విద్యార్థులకు సైతం పీజీ వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అన్ని స్పెషాలిటీలలో పీజీ సీట్లు 1,008 ఉండగా.. కొత్తగా 939 సీట్లను పెంచుకునే అవకాశం ఉన్నట్టు వైద్య విద్యా శాఖ తాజా అంచనాల్లో తేలింది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కాలేజీల్లో భారీగా సీట్లు పెరగనున్నాయి.

అదనపు పడకలు.. స్టాఫ్‌కు అనుమతి కావాలి

ప్రస్తుత అంచనా ప్రకారం 939 పీజీ సీట్లు పెంచుకోవాలంటే ఆయా కళాశాలల్లో అదనపు పడకలు, అందుకు తగిన సిబ్బంది నియామకానికి అనుమతి కావాలి.  బోధనాస్పత్రుల్లో వాస్తవ పడకల సంఖ్య 11,274 కాగా.. ఎప్పటికప్పుడు అవసరం మేరకు అనధికారికంగా పడకలు పెంచుకుంటూ వాటిని 13,376కు చేర్చారు. అంటే 2,102 పడకలు అనధికారికంగా ఉన్నాయి. తాజాగా అంచనా వేసిన
లెక్క ప్రకారం 7,783 పడకలు కావాలి. ప్రస్తుతం అనధికారికంగా ఉన్న 2,102 పడకలతో పాటు 5,681 పడకలకు మంజూరు ఇవ్వాలి.

భారీగా యూనిట్లు పెరుగుతాయి

బోధనాస్పత్రుల్లో యూనిట్లే కీలకం. ప్రస్తుతం మన బోధనాస్పత్రుల్లో 377 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉంటారు. పీజీ వైద్య సీట్లు పెరగాలంటే మరో 184 యూనిట్లు పెంచాలని అంచనా వేశారు. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన పడకలు, యూనిట్లు పెంచుకుంటూ వెళ్లాలి. కానీ గత ఏడేళ్లుగా ఈ పని జరగలేదు. దీంతో జనాభా పెరుగుతున్న కొద్దీ బోధనాస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. పీజీ సీట్లు, పడకలు, యూనిట్లు పెరిగితే ఈ ఒత్తిడి తగ్గుతుంది.

సిబ్బందిని పెంచుకోవాల్సిందే

పీజీ సీట్లు పెంచుకోవాలంటే వైద్య అధ్యాపకులను పెంచుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా 15 మంది ప్రొఫెసర్లు, 111 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం 57 సూపర్‌ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. సిబ్బందిని పెంచుకోవడం వల్ల 33 అదనపు సూపర్‌ స్పెషాలిటీ సీట్లనూ పెంచుకునే వీలుంటుంది. యూనిట్లు, పడకలు, వైద్యులు వంటివన్నీ పెరగడం వల్ల రోజువారీ ఔట్‌ పేషెంట్‌ సేవలు, ఇ¯ŒS పేషెంట్‌ సేవలు భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

కాలేజీల వారీగా ప్రస్తుతం ఉన్న పీజీ సీట్లు.. పెంచుకునే అవకాశం ఉన్న సీట్లు ఇలా..

 

వైద్య కాలేజీ

ప్రస్తుత పీజీ సీట్లు

పెరిగేందుకు అవకాశం గల సీట్లు

జీఎంసీ, శ్రీకాకుళం

20

82

ఏఎంసీ, విశాఖపట్నం

212

02

ఆర్‌ఎంసీ, కాకినాడ

133

107

ఎస్‌ఎంసీ, విజయవాడ

89

78

జీఎంసీ, గుంటూరు

101

165

జీఎంసీ, ఒంగోలు

14

135

ఏసీఎస్‌ఆర్, నెల్లూరు

00

135

జీఎంసీ, కడప

36

95

కేఎంసీ, కర్నూలు

139

44

ఎస్వీఎంసీ, తిరుపతి

142

42

జీఎంసీ, అనంతపురం

102

20

డెంటల్‌కాలేజీ, విజయవాడ

09

18

డెంటల్‌ కాలేజీ, కడప

11

16


చదవండి:

పరీక్షలు వాయిదా పడటంతో.. కోవిడ్‌ విధుల్లోకి పీజీ వైద్య విద్యార్థులు..!

2021-22 విద్యా సంవత్సరం నుంచిఏరియా ఆస్పత్రుల్లోనూ పీజీ వైద్య సీట్లు..

 

Published date : 14 Sep 2021 05:04PM

Photo Stories