Skip to main content

పరీక్షలు వాయిదా పడటంతో.. కోవిడ్‌ విధుల్లోకి పీజీ వైద్య విద్యార్థులు..!

సాక్షి, అమరావతి: వైద్యవిద్యార్థులు కోవిడ్‌ వైద్యసేవలు చేపట్టారు.
వారం రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల విద్యార్థులను కోవిడ్‌ విధుల్లో వినియోగించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మొత్తం వైద్యకాలేజీల్లో చదువుతున్న పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్‌సర్జన్లు, ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులు, దంతవైద్య విద్యార్థులను విధుల్లోకి తీసుకుంది. కోవిడ్‌ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయని, దీంతో వీళ్లను కోవిడ్‌ సేవలకు వాడుకోవాలని నిర్ణయించారు. వీళ్ల సేవల్ని క్యాజువాలిటీ, కోవిడ్‌కేర్‌ సెంటర్లు, జనరల్‌ వార్డులు వంటిచోట్ల ఉపయోగించుకుంటారు. ఇప్పటికే అన్ని వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీచేయడంతో విద్యార్థులు కోవిడ్‌ విధుల్లో చేరారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులకు కాస్త ఊరట లభించినట్లయింది. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టేవరకు వీళ్లందరూ వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తారు.

ఈనెల 16వ తేదీ వరకు విధుల్లో చేరిన వారు...

కేటగిరీ

విధుల్లో చేరినవారి సంఖ్య

పీజీ వైద్య విద్యార్థులు

2,068

హౌస్‌ సర్జన్లు

2,467

ఫైనల్‌ ఎంబీబీఎస్‌

676

నర్సింగ్‌ విద్యార్థులు

2,061

దంతవైద్యులు

381

మొత్తం

7,653

Published date : 18 May 2021 01:47PM

Photo Stories