VIMS: విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఆస్పత్రిగా పేరున్న విమ్స్(విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో వైద్యుల నియామకానికి అనుమతివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ రాఘవేంద్రరావు లేఖ రాశారు.
ప్రస్తుతం విమ్స్‌లో 31 మంది డాక్టర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. విమ్స్‌కు రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని.. వారికి ఈ 31 మంది సరిపోవడం లేదని వివరించారు. కొత్త నియామకాలకు అనుమతిస్తే స్పెషలిస్టు వైద్యులను నియమించుకుంటామని తెలిపారు. ఇప్పటికే విమ్స్‌కు 216 పోస్టులు కేటాయించారని పేర్కొన్నారు. ప్రొఫెసర్స్ 20 మంది, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేదా సీనియర్ కన్సల్టెంట్‌లు 26, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు 68, సీనియర్ రెసిడెంట్స్ 102 మందిని నియమించుకునేందుకు వీలుందని వివరించారు. 2018లో టీడీపీ ప్రభుత్వం అన్ని కేడర్‌ల పోస్టులు కలిపి 874 మందిని నియమించుకోవచ్చని జీవో ఇచ్చింది. కానీ నియామకాలు మాత్రం చేపట్టలేదు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నియామకాలకు అనుమతివ్వాలని డీఎంఈ కోరారు.
Published date : 09 Sep 2021 01:43PM